Samantha Silent ₹100 Cr SuccessCelebration
సినిమా విజయం సాధించిందని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో రకరకాల మార్గాలు ఉన్నాయి. భారీ పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచారం, వరుస ఇంటర్వ్యూలు, సక్సెస్ మీట్లు.. ఇలా సినిమా గురించి ప్రేక్షకుల్లో చర్చ జరిగేలా చేయడానికి మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక బాక్సాఫీస్ వసూళ్ల విషయంలోనూ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే విషయంలో రకరకాల క్లెయిమ్స్ వినిపిస్తుంటాయి. అయితే వీటన్నింటికీ భిన్నంగా సమంత సోలో హీరోయిన్గా నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ టీమ్ చాలా సైలెంట్‌గా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడమే కాకుండా ఎలాంటి ప్రమోనల్ ఈవెంట్ చేయకుండానే టీమ్‌కు సక్సెస్ షీల్డ్‌లను అందించారు. అయితే ఈ కార్యక్రమంలో కనిపించిన ఒక అంశం మాత్రం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది.
Samantha Silent ₹100 Cr SuccessCelebration
సాధారణంగా ఒక సినిమా రూ.100 కోట్ల మార్క్‌ను అందుకుంటే ఆ విజయాన్ని భారీ స్థాయిలో ప్రచారం చేసుకోవడం చూస్తుంటాం. మీడియా సమావేశాలు, గ్రాండ్ సక్సెస్ ఈవెంట్స్, భారీగా పోస్టర్లు.. ఇలా తమ సినిమా సాధించిన వసూళ్లను ప్రేక్షకులకు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు.
కానీ ‘మా ఇంటి బంగారం’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. పెద్దగా ప్రమోషనల్ హంగామా లేకుండానే సినిమా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్‌ను అందుకున్న సందర్భంగా టీమ్‌కు సక్సెస్ షీల్డ్‌లను అందించడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
డబ్బులు రాకపోయినా రూ.100 కోట్లు వచ్చాయని చెప్పుకునే రోజులు ఇవి అంటూ తరచూ బాక్సాఫీస్ నంబర్లపై చర్చ జరుగుతున్న సమయంలో.. ఎలాంటి భారీ ప్రమోషనల్ హంగామా లేకుండా ఇలాంటి సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించడం నిజంగా అభినందించదగ్గ విషయమే అని చెప్పొచ్చు. సినిమా ఎంత వసూలు చేసిందనే విషయాన్ని ప్రచారం చేసుకోవడం కంటే.. ఆ సినిమాకు పనిచేసిన టీమ్‌ను గుర్తించి, వారి కష్టాన్ని సెలబ్రేట్ చేయడానికే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఒక హీరోయిన్ బేస్డ్గా తెరకెక్కిన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ప్రత్యేకమైన విషయమే.
ముఖ్యంగా సోలో హీరోయిన్గా సమంతకు ఈ విజయం మరింత ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. స్టార్ హీరోల సినిమాలకు ఉండే భారీ ఓపెనింగ్స్, మాస్ హైప్, ఫ్యాన్ బేస్ లాంటి అంశాలు లేకుండా ఒక కథను నమ్ముకుని సినిమా ముందుకు వెళ్లడం.. ఆ తర్వాత ప్రేక్షకుల ఆదరణతో ఈ స్థాయికి చేరుకోవడం ఈ విజయాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోంది.
అందుకే ఈ సక్సెస్ షీల్డ్స్‌ను కేవలం ఒక సినిమా విజయానికి గుర్తుగా కాకుండా.. సమంత సోలోగా సాధించిన ఒక ముఖ్యమైన మైలురాయికి గుర్తుగా చూడొచ్చు.
ఈ విజయాన్ని కేవలం సక్సెస్ షీల్డ్స్‌తో ముగించలేదు సమంత. సినిమా కోసం కష్టపడ్డ టీమ్ సభ్యులందరికీ ప్రత్యేకంగా గిఫ్ట్స్ అందించి తన కృతజ్ఞతను చాటుకుంది.
డైరెక్షన్ టీమ్‌లోని కొందరికి ఏకంగా కార్లను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొందరికి బంగారు నాణేలను గిఫ్ట్‌గా అందించింది. ఒక సినిమా విజయానికి హీరో, హీరోయిన్ మాత్రమే కారణం కాదని.. తెర వెనుక పనిచేసే ప్రతి ఒక్కరి కష్టం ఉంటుందని గుర్తించిన సమంత, వారందరినీ ఈ విధంగా గౌరవించడం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది.
Samantha Silent ₹100 Cr SuccessCelebration
సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి గిఫ్ట్స్ ఇవ్వడం ద్వారా ఈ విజయం తన ఒక్కరి విజయం కాదని, మొత్తం టీమ్‌ది అని సమంత చాటిచెప్పినట్టైంది.
ఇక ఈ సక్సెస్ సెలబ్రేషన్లో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న సమంత బేబీ బంప్‌తోనే ఈ కార్యక్రమానికి హాజరై టీమ్‌తో కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. సక్సెస్ షీల్డ్స్ అందించడంతో పాటు టీమ్ సభ్యులతో కలిసి ఫొటోలు దిగుతూ, వారిని అభినందిస్తూ కనిపించింది. ఈ విజయం తనకు ఎంత ప్రత్యేకమో ఆమె హాజరైన తీరు చూస్తేనే అర్థమవుతోంది.
ఒకవైపు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్న సమయంలో.. మరోవైపు కెరీర్లో కీలకమైన రూ.100 కోట్ల విజయాన్ని అందుకోవడం సమంతకు డబుల్ సెలబ్రేషన్‌గా మారింది.
ఈ రోజుల్లో సినిమా రిలీజ్‌కు ముందే భారీగా హైప్ క్రియేట్ చేయడం, రిలీజ్ తర్వాత వసూళ్లపై రకరకాల నంబర్లు ప్రకటించడం సాధారణంగా మారిపోయింది. కానీ ‘మా ఇంటి బంగారం’ విషయంలో అంతటి హంగామా కనిపించకపోయినా సినిమా తనదైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ మైలురాయిని అందుకోవడం గమనించాల్సిన విషయం. అందుకే ఈ సక్సెస్ సెలబ్రేషన్లో ఇచ్చిన షీల్డ్స్ కంటే.. ప్రమోషన్ లేకుండా, పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్‌గా రూ.100 కోట్ల మార్క్‌ను అందుకోవడమే ఈ సినిమాకు అసలైన సక్సెస్ షీల్డ్ అని చెప్పొచ్చు.
బాక్సాఫీస్ నంబర్ల విషయంలో ఎన్ని క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్ ఉన్నా.. ప్రేక్షకుల స్పందనతో వచ్చిన వసూళ్లే సినిమాకు అసలైన బలం. ఆ కోణంలో ‘మా ఇంటి బంగారం’ విజయం టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన ఉదాహరణగా నిలుస్తోంది.