‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్‌ను కాస్త కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తుండటంతో అసలు ఎవరు ఫైనల్ అన్నదానిపై సందేహాలు పెరిగిపోతున్నాయి. మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే పేరు బలంగా వినిపించింది. గ్లామర్, డ్యాన్స్‌లో ఆమెకు ఉన్న ఇమేజ్ కారణంగా ఆమెనే ఫైనల్ అనుకున్నారు. పైగా ‘రంగస్థలం’లో చరణ్‌తో కలిసి ‘జిగేలు రాణి’గా అలరించి సినిమా హిట్‌లో ఈ పాట కూడా భాగమైంది. దీంతో ఈ హిట్ జోడీ మరోసారి రిపీట్ అవుతుందనుకున్నారు. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా ‘పెద్ది’ పాట కోసం మృణాల్ ఠాకూర్ అంటూ ఆమె పేరు తెరపైకి వచ్చింది. తన నేచురల్ చార్మ్‌తో మృణాల్ ఈ పాటకు కొత్త లుక్ తీసుకురాగలదని టాక్ వినిపించింది. ఇంతలో మరో ట్విస్ట్‌గా సంయుక్త మీనన్ పేరు కూడా లిస్ట్‌లో చేరింది. వరుస హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్న సంయుక్త ఈ స్పెషల్ సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ మరింత కన్ఫ్యూజ్ అయ్యారు.

కానీ ఇప్పుడు తాజా టాక్ ఏమిటంటే.. ఈ రేస్‌కు ఫుల్ స్టాప్ పెట్టి శృతి హాసన్ ను ఫైనల్ చేశారట. మాస్ అప్పీల్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ అన్నీ కలిపి చూసుకుంటే ఈ పాటకు శృతి సరైన ఛాయిస్ అని మేకర్స్ భావించారని తెలుస్తోంది. పన్నెండేళ్ల క్రితం చరణ్, శృతి హాసన్ జంటగా ‘ఎవడు’ సినిమాలో నటించారు. వీరి జోడీ ప్రేక్షకులకు మరోసారి కనువిందు చేస్తుందని నమ్ముతున్నారు. అలాగే శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నమ్ముతున్నారు. శృతి హాసన్ నటిగా మాత్రమే కాకుండా, సింగర్‌‌గా కూడా తనదైన ముద్ర వేసుకుంది. ఆమె పాడిన, నటించిన కొన్ని స్పెషల్ సాంగ్స్ పాపులర్ కూడా అయ్యాయి. ఆమె గతంలో మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమాలో ‘జంక్షన్‌లో’ అనే ఐటమ్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని చివరకు ‘పెద్ది’లో ఆమెను ఫైనల్ చేశారట దర్శకుడు బుచ్చిబాబు. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ ఈనెల 26 నుంచి హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో చిత్రీకరించనున్నారట. ఈ పాట షూట్‌తో మొత్తం షూటింగ్‌ పూర్తికానుంది. ఈ స్పెషల్ సాంగ్ పెద్ది సినిమాకు హైలైట్ అయ్యేలా ఉండాలని ఇలాంటి ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఫైనల్‌గా ఎవరు స్టెప్పులు వేస్తారు? ఆ సర్‌‌ప్రైజ్ కోసం ఫ్యాన్స్ ఇంకొంచెం వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి అద్భుతమైన తారాగణం కీలక పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌లో సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

Related Posts

‘దేవర 2’ పక్కనపెట్టి.. బాలయ్యతో బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసిన కొరటాల

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. నటసింహం బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌‌తో జనతా గ్యారేజ్, దేవర వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన…

ఈసారి కష్టమో నష్టమో నేనే భరిస్తా

టాలీవుడ్‌లో కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే హీరో రామ్ పోతినేని Ram Pothineni ఇప్పుడు మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను అలరించిన రామ్, ఇరవై ఏళ్ల తన కెరీర్‌‌లో ఈసారి కొత్త…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 4 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 6 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని