Oh..! Sukumari Teaser Launch Event
యంగ్ హీరో తిరు వీర్, వెర్సటైల్ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న గ్రామీణ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఆసక్తి రేకెత్తించిన మూవీ, ఇప్పుడు హిలేరియస్ టీజర్‌తో ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.
Oh..! Sukumari Teaser Launch Event
టీజర్ విషయానికొస్తే.. స్థానిక రాజకీయాల్లో చురుకుగా ఉండే, మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కనే యువకుడిగా తిరు వీర్ కనిపించారు. అలా అతని జీవితంలోకి దామిని ( ఐశ్వర్య రాజేష్ ) రావడంతో ఆమెనే తన జీవిత భాగస్వామిగా భావించి పెళ్లి ఏర్పాట్లు మొదలుపెడతాడు. అయితే ఆమె కుటుంబం ఒక విచిత్రమైన రహస్యాన్ని దాచిపెడుతుంది. దామినిని తాకిన ప్రతి ఒక్కరికీ విద్యుత్ షాక్ కొట్టడం ఈ కథలోని ప్రధాన ట్విస్ట్‌గా టీజర్లో చూపించడం హైలైట్‌గా నిలిచింది. ఈ కాన్సెప్ట్ చుట్టూ సాగే సన్నివేశాలు టీజర్లో నవ్వులు పూయించాయి. విలేజ్ పాలిటిక్స్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలగలిపిన కథగా దర్శకుడు భరత్ దర్శన్ సినిమాను రూపొందించినట్టు టీజర్ స్పష్టం చేసింది. సీహెచ్ కుషేందర్ అందించిన గ్రామీణ విజువల్స్, భరత్ మంచిరాజు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరింత ఆకట్టుకునేలా చేశాయి.

టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో తిరు వీర్ మాట్లాడుతూ.. “ఈ సినిమానే మమ్మల్ని ఎంచుకుందని నేను భావిస్తున్నాను. ఫ్యామిలీ, పిల్లలు కలిసి చూసే సినిమాలు చాలా కాలం గుర్తుండిపోతాయి. అలాంటి విజయమే ఈ సినిమాకు దక్కుతుంది. ఐశ్వర్య గారితో ఇది నా రెండో సినిమా. ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఎప్పుడూ కథే ముఖ్యం. కథ బాగుంటే సినిమా ఆడుతుంది. ఈ సినిమాలో కథ, కామెడీ, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు మంచి సినిమా చూసామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారు’’ అని అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత నేను సైన్ చేసిన మొదటి సినిమా ఇదే. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. కథను చాలా బాగా రాసుకున్నారు. హీరోయిన్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందనే కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రాలేదనుకుంటాను. నిజానికి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్‌ను ముట్టుకుంటే షాక్ కొట్టినట్టు అనిపించేది. అలాంటి మనుషులు నిజంగానే ఉంటారా అనిపించేది. ఈ కథ విన్న తర్వాత నిజంగా ఉంటారేమో అనిపించింది” అని చెప్పారు.
దర్శకుడు భరత్ దర్శన్ మాట్లాడుతూ ‘‘టీజర్ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్ ఇంకా అదిరిపోతుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ కొత్తగా ఎంటర్టైన్ చేస్తుంది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి” అని తెలిపారు.
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘చాలా మంచి సినిమా తీశాం. ప్రేక్షకులు చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
యాక్టర్ జీవన్ మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది” అని చెప్పారు. యాక్టర్ గవి రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇది చాలా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా. ఇందులో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఐశ్వర్య గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పాడు.
డీవోపీ కుషేందర్ మాట్లాడుతూ ‘‘ఇది హై వోల్టేజ్ బ్లాక్‌బస్టర్ సినిమా. కంటెంట్ విన్నప్పటి నుంచే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఐశ్వర్య గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు” అని చెప్పారు.