Nikhil Swayambhu A Visual Wonder with 2,700 VFX Shots:
నిఖిల్ హీరోగా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తున్న మోస్ట్ ప్రెస్ట్రేజీయస్ మూవీ ‘స్వయంభు’. నిఖిల్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి రూపుదిద్దుతున్న ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా విడుదల చేసిన వీడియోలో సినిమా వీఎఫ్ఎక్స్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశారు మేకర్స్. ఈ వీడియోలో హీరో నిఖిల్ సిద్ధార్థతో పాటు దర్శకుడు భరత్ కృష్ణమాచారి, సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కలిసి వీఎఫ్ఎక్స్ సంస్థ ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోను సందర్శించిన దృశ్యాలు కనిపించాయి. అక్కడ వందలాది మంది టెక్నీషియన్లు ఫ్రేమ్ టు ఫ్రేమ్‌గా ‘స్వయంభు’ ప్రపంచాన్ని తీర్చిదిద్దుతున్న తీరు ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో 2700కి పైగా వీఎఫ్ఎక్స్ షాట్లు ఉండటం విశేషం. దాదాపు 750 మందికి పైగా వీఎఫ్ఎక్స్ నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారని సమాచారం. భారీ యుద్ధ సన్నివేశాలు, విశాలమైన రాజ్యాలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను హాలీవుడ్ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజీ ఫ్రేమ్‌ను మూవీ టీమ్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ టెక్నికల్‌గా మంచి క్వాలిటీ కోసం కృషి చేస్తోంది. నిఖిల్‌తో పాటు కేకే సెంథిల్ కుమార్ కూడా వీఎఫ్ఎక్స్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సినిమాపై ఉన్న కమిట్మెంట్ను చూపిస్తోంది.,

Nikhil Swayambhu A Visual Wonder with 2,700 VFX Shots:
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక విజువల్ ప్రాజెక్టులలో ఒకటిగా ‘స్వయంభు’ను మలుస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. అలాగే నిఖిల్ యోధుడి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన తొలి పాట ‘రా రా ధీవరా’ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌ను కేకే సెంథిల్ కుమార్ తన కెమెరాలో బంధిస్తుండగా, సంగీత సంచలనం రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను ఎం. ప్రభాహరణ్, రవీందర్ నిర్వహిస్తున్నారు. విజయ్ కామిశెట్టి డైలాగ్స్ రాస్తున్నారు. భారీ అంచనాల నడుమ త్వరలోనే ‘స్వయంభు’ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.