Nagarjuna 100 Movie Title Reavel
టాలీవుడ్లో తనదైన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న కింగ్ నాగార్జున కెరీర్లో 100వ సినిమా కావడంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాకపోవడంతో ఈ మూవీ చుట్టూ ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ నాగార్జున స్వయంగా సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు.
Nagarjuna 100 Movie Title Reavel
సోమవారం జరిగిన ‘పళ్ళబురుసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న నాగార్జున తన 100వ చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్‌ను ప్రకటించారు. దీంతో ఇన్నాళ్లుగా నాగ్ 100వ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై సాగుతున్న ఊహాగానాలకు చెక్ పడింది. నాగార్జున కెరీర్లో ఇది 100వ సినిమా కావడంతో ‘కింగ్ 100’ అనే టైటిల్ కూడా అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఉండేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మరోసారి కలిసి నటించడం ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సినిమాలో టబు కీలకమైన, పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, విజయేంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటివరకు ‘కింగ్ 100’ నుంచి అధికారికంగా పెద్దగా ఎలాంటి విజువల్స్ బయటకు రాలేదు. దీంతో నాగార్జునను దర్శకుడు రా. కార్తీక్ ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారు? కథ నేపథ్యం ఏంటి? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఈ ఆసక్తికి మరింత కిక్ ఇచ్చేలా ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘కింగ్ 100’ నుంచి స్పెషల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంటే టైటిల్‌పై క్లారిటీ వచ్చినా.. నాగ్ 100వ సినిమా అసలు లుక్, కథపై తొలి క్లూ మాత్రం ఆయన బర్త్‌డే రోజునే బయటకు రానుంది.
నాగార్జున కెరీర్లో ఎన్నో ప్రయోగాత్మక, కమర్షియల్ చిత్రాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అలాంటి హీరో తన 100వ సినిమాను ఎలాంటి కథతో ఎంచుకున్నారు? తన ఇమేజ్‌కు తగ్గట్టుగా దర్శకుడు ఎలాంటి పాత్రను డిజైన్ చేశాడు? అనే ప్రశ్నలకు ఆగస్టు 29న వచ్చే గ్లింప్స్ సమాధానం చెప్పే అవకాశం ఉంది.