Mega Hero Sai Durgha Tej Gets Engaged
మెగా కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి మొదలైంది. యువ హీరో సాయి దుర్గా తేజ్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలు కిరణ్మయితో ఆయన నిశ్చితార్థ వేడుక నవంబర్ 5న హైదరాబాద్లోని హిల్టన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్లో అత్యంత ఆత్మీయంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక ఆనందంగా సాగింది.
Mega Hero Sai Durgha Tej Gets Engaged
కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందిన సభ్యులంతా ఒకచోట చేరి ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాయి దుర్గా తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయదుర్గ, సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు బాబీ, నీలా షా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వాయువ్ తేజ్, నాగబాబు, పద్మజ, నిహారిక కొణిదెల ఈ వేడుకలో సందడి చేశారు.
అలాగే అల్లు అరవింద్, అల్లు నిర్మల, అల్లు శిరీష్, నయనికా రెడ్డి, అకీరా నందన్, ఆద్య కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ, హర్ష చెముడు, వెంకీ కుడుముల, నవదీప్, హర్షిత్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు, సన్నిహితులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇక సాయి దుర్గా తేజ్, కిరణ్ వివాహం డిసెంబర్ 10, 2026న హైదరాబాద్లో జరగనుంది. దీంతో మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి వేడుకల సందడి మరింత పెరగనుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.