Mayaledy – Chikato Vaipuna Song Out
యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మాయలేడి’. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్గా నటిస్తోంది. కంటెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రే.. గతంలో ‘ఎవరికీ చెప్పొద్దు’, ‘పేకమేడలు’ వంటి విభిన్న చిత్రాలను నిర్మించి ప్రశంసలు అందుకున్నారు. అదే తరహాలో ఇప్పుడు ‘మాయలేడి’తో మరో ఆసక్తికరమైన కథను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.
Mayaledy – Chikato Vaipuna Song Out
తాజాగా ఈ సినిమా నుంచి ‘చీకటో వైపున..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమలో గెలుపోటముల మధ్య ఓ వ్యక్తి అనుభవించే ఎమోషనల్ పెయిన్‌ను ఈ పాటలో చూపించడం ఆకట్టుకుంది. ‘చీకటో వైపున.. వేకువో వైపున.. తేల్చలేని యదే శూన్యమా..’ అంటూ మొదలయ్యే ఈ పాటలో ప్రేమను కోల్పోయిన మనసులోని ఒంటరితనం, బాధ, నిస్సహాయత స్పష్టంగా వినిపిస్తాయి. ‘మౌనమే నేరమా.. ఊహలే శూన్యమా..’ అంటూ సాగే పదాలు పాటకు మరింత ఎమోషనల్ కనెక్ట్‌ను తీసుకొచ్చాయి. ఈ హార్ట్ టచింగ్ మెలోడీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా, కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు. యాజిన్ నిజార్, సింధూరి విశాల్ తమ వాయిస్‌తో పాటకు ప్రాణం పోశారు. ముఖ్యంగా ప్రేమలోని విరహాన్ని, గుండెల్లో దాచుకున్న బాధను ఈ పాటలోని పదాలు, సంగీతం కలిసి చక్కగా ఎలివేట్ చేశాయి. త్వరలోనే ‘మాయలేడి’ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.