‘దేవర 2’ పక్కనపెట్టి.. బాలయ్యతో బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసిన కొరటాల

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. నటసింహం బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌‌తో జనతా గ్యారేజ్, దేవర వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన కొరటాల శివ.. ఇప్పుడు బాలయ్య బాబు కోసం ఓ పవర్‌‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సమాజానికి మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్‌ను బలంగా మేళవించే కొరటాల శివ స్టైల్‌కు బాలకృష్ణ మాస్ ఇమేజ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, రాజకీయ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ కథ ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొరటాల శివ ఈ స్టోరీని బాలకృష్ణకు నరేషన్ ఇచ్చినట్టు, కథ నచ్చిన బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతానికి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ (NBK111) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తవగానే కొరటాల కథను షిప్ట్ కానున్నారు. ఈ కాంబినేషన్ నిజమైతే, ఇది టాలీవుడ్‌లో మరో బిగ్ ప్రాజెక్ట్‌గా మారడం ఖాయం.
ఇప్పటివరకు ఎన్టీఆర్‌తో వరుసగా హిట్ చిత్రాలు అందించిన కొరటాల శివ, బాలకృష్ణతో కూడా అదే మేజిక్ రిపీట్ చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

వాస్తవానికి కొరటాల శివ ‘దేవర’ తర్వాత మొన్నటివరకు ‘దేవర 2’ స్ర్కిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారు. కానీ ఎన్టీఆర్ లైనప్ కారణంగా దీనికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉందని ‘దేవర 2’ పనులను పక్కనపెట్టి.. ఈసారి ఎన్టీఆర్ బాబాయ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఆయన కోసం గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఓ పవర్‌‌ఫుల్ స్టోరీని సిద్ధం చేయడంతో వెంటనే బాలయ్య కూడా గ్రీన్ ఇచ్చారట. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌‌పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.

Related Posts

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్‌ను కాస్త కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తుండటంతో అసలు ఎవరు…

ఈసారి కష్టమో నష్టమో నేనే భరిస్తా

టాలీవుడ్‌లో కొత్త ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే హీరో రామ్ పోతినేని Ram Pothineni ఇప్పుడు మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను అలరించిన రామ్, ఇరవై ఏళ్ల తన కెరీర్‌‌లో ఈసారి కొత్త…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని