Klin Kaara’s First Look:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉసాసన కామినేని కొణిదెల తమ గారాలపట్టి క్లీంకార కొణిదెల ముఖాన్ని తొలిసారి స్పష్టంగా అభిమానులకు చూపించారు. క్లీంకార మూడో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ కుటుంబ ఫొటో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇన్నాళ్లూ తమ కుమార్తె ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చిన ఈ జంట, ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులకు ఈ మధురమైన సర్ప్రైజ్ ఇచ్చారు.
ఫొటో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పోలికలపై చర్చ మొదలైంది. కొందరు “అచ్చం అమ్మ ఉపాసన చిన్నప్పటి ఫొటోలా ఉంది” అని కామెంట్లు చేస్తుంటే, మరికొందరు “ముఖంలో మెగా కుటుంబ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ తల్లి సురేఖ కొణిదెల పోలికలు ఉన్నాయి” అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవన్నీ అభిమానుల వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప, ఖచ్చితమైన నిర్ధారణ కాదని చెప్పాలి. చిన్నారుల రూపురేఖలు ఎదుగుదలతో పాటు మారుతూ ఉంటాయి.
Klin Kaara’s First Look:
క్లీంకార ఎప్పుడు పుట్టింది?
2023 జూన్ 20న హైదరాబాద్‌లో క్లీంకార జన్మించింది. దాదాపు 11 ఏళ్ల వైవాహిక జీవితానంతరం రామ్ చరణ్–ఉపాసన దంపతులకు ఆమె జన్మించడం మెగా కుటుంబంలో ఆనందాన్ని నింపింది. క్లీంకార పుట్టిన సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.
‘క్లీంకార’ పేరులోని ప్రత్యేకత
క్లీంకార అనే పేరు కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఈ పేరు లలితా సహస్రనామం నుంచి తీసుకున్నది. ఈ పేరు “ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగించే పవిత్రమైన, పరివర్తనాత్మక శక్తి”ని సూచిస్తుందని కుటుంబ సభ్యులు నామకరణం సందర్భంగా వెల్లడించారు. చెంచు గిరిజన దేవత భౌరమ్మ ఆశీస్సులతో ఈ పేరును పెట్టినట్లు కూడా పేర్కొన్నారు.
కూతురు గురించి రామ్ చరణ్ ఏమన్నాడు?
కూతురు పుట్టిన తర్వాత తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని రామ్ చరణ్ పలుమార్లు చెప్పాడు. షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రానికి ఇంటికి చేరుకుని క్లీంకారతో సమయం గడపాలని ప్రయత్నిస్తానని, ఆమెకు భోజనం పెట్టడం, కథలు చెప్పడం తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. “నా కూతురి ఎదుగుదలలో ఒక్క క్షణం కూడా మిస్ అవ్వాలనుకోవడం లేదు” అని చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అలాగే, క్లీంకార తనలాగా సినీ రంగంలోకి రావడం కంటే, తల్లి ఉపాసనలాగే సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగాలని కోరుకుంటున్నానని కూడా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
Klin Kaara’s First Look:
ప్రైవసీకి పెద్దపీట
క్లీంకార పుట్టినప్పటి నుంచి ఆమె ముఖాన్ని మీడియాకు దూరంగా ఉంచిన రామ్ చరణ్–ఉపాసన దంపతులు, తమ కుమార్తె సాధారణ బాల్యాన్ని ఆస్వాదించాలని భావించారు. అందుకే చాలా కాలం పాటు ఫొటోలు పంచుకున్నప్పటికీ ఆమె ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు మూడో పుట్టినరోజు సందర్భంగా ముఖాన్ని రివీల్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్లీంకార తాజా ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. “అమ్మలా ఉంది”, “అత్తగారి పోలికలు కనిపిస్తున్నాయి”, “మెగా ప్రిన్సెస్ చాలా క్యూట్‌గా ఉంది” అంటూ అభిమానులు వరుసగా కామెంట్లు చేస్తున్నారు.