king-nagarjuna-100th-movie-king-100-title-glimpse
టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం అధికారికంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున మైల్స్టోన్ మూవీకి ‘కింగ్ 100’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. శనివారం (ఆగస్టు 29) నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
king-nagarjuna-100th-movie-king-100-title-glimpse
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌లో నాగార్జునను పూర్తిగా కొత్త, స్టైలిష్ మరియు పవర్ఫుల్ అవతార్‌లో చూపించారు.
king-nagarjuna-100th-movie-king-100-title-glimpse
గ్లింప్స్ ప్రారంభంలో వినిపించే నాగార్జున వాయిస్ ఓవర్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. సమాజం ఒక వ్యక్తిని అతడి వ్యక్తిత్వం కంటే సంపద ఆధారంగా ఎలా అంచనా వేస్తుందనే అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. తన దగ్గర ఏమీ లేనప్పుడు తనను ‘లూజర్’ అని పిలిచారని, సంపద వచ్చిన తర్వాత అదే ప్రపంచం తనను ‘ది కింగ్’ అని పిలుస్తోందంటూ నాగార్జున చెప్పే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంతేకాదు, నాగార్జున ఫొటోతో పాటు రూ.50,000 కోట్ల భారీ స్కామ్ వార్తను చూపించడం కథలోని మిస్టరీ ఎలిమెంట్‌పై ఆసక్తిని పెంచింది. అసలు ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న కథ ఏమిటి? నాగార్జున పాత్రకు దీనికి ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలను గ్లింప్స్ ప్రేక్షకుల ముందుంచింది. నాగార్జున 100వ సినిమాకు ‘కింగ్ 100’ అనే టైటిల్ పెట్టడం అభిమానులకు డబుల్ సెలబ్రేషన్‌లా మారింది. ‘కింగ్’ అనే ఇమేజ్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగార్జునకు, ఆయన కెరీర్ మైల్స్టోన్ మూవీకి ఈ టైటిల్ పర్ఫెక్ట్ మ్యాచ్‌గా నిలిచింది.
ఈ సినిమాలో నాగార్జున లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ మేకోవర్, డైనమిక్ యాటిట్యూడ్‌తో ఆయన కనిపించిన తీరు అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. ఒక నిజమైన సూపర్‌స్టార్‌కు ఉండే రాయల్ స్వాగ్తో నాగార్జున పాత్రను డిజైన్ చేసినట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. దర్శకుడు రా కార్తీక్ ఈ చిత్రాన్ని ఫ్రెష్ టేకింగ్‌తో తెరకెక్కిస్తున్నారని టైటిల్ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, రిచ్ విజువల్స్ సినిమాకు భారీ స్థాయి కల్పించాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ మేకర్స్ స్కేల్ కనిపిస్తోంది. మరోవైపు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన హై-ఎనర్జీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు ప్రధాన బలంగా నిలిచింది. విజువల్స్‌కు తగ్గట్టుగా డీఎస్పీ ఇచ్చిన పవర్ఫుల్ మ్యూజిక్ ప్రేక్షకుల్లో ఎక్స్ట్రా హైప్‌ను క్రియేట్ చేసింది. నాగార్జున–దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేయబోతోందనే అంచనాలు పెరుగుతున్నాయి.

మొత్తానికి ‘కింగ్ 100’ టైటిల్ గ్లింప్స్ నాగార్జున అభిమానులకు ఒక గ్రాండ్ బర్త్‌డే గిఫ్ట్‌గా నిలిచింది. పవర్ఫుల్ హీరో క్యారెక్టర్, ఆసక్తికరమైన కథాంశం, భారీ స్కామ్ నేపథ్యంలో నడిచే మిస్టరీ, స్టైలిష్ ప్రెజెంటేషన్, గ్రాండ్ విజువల్స్‌తో ఈ చిత్రం నాగార్జున కెరీర్లో ప్రత్యేక చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.