Balayya 111: Christmas Mass Blast
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాలకృష్ణ కెరీర్లో 111వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్‌ను మేళవిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
Balayya 111: Christmas Mass Blast
ఇటీవల షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడటంతో చిత్రీకరణకు స్వల్ప విరామం వచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్న బాలయ్య వచ్చే నెలలో తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం. అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసి, డిసెంబర్ 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్యకు గాయం కారణంగా షూటింగ్‌కు లేట్ అవుతుందేమోనని.. ఈ చిత్రాన్ని సంకాంతి బరిలో ఉంచేలా మేకర్స్ భావించారు. కానీ బాలయ్య పడిలేచిన కెరటంలా.. షూట్‌కు రెడీ అనడంతో.. క్రిస్మస్ పండుగను టార్గెట్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా బాలయ్య అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు పక్కా ఫీస్ట్‌గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారట.
Balayya 111: Christmas Mass Blast
ఇప్పటికే విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ గ్లింప్స్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని విధంగా పవర్ఫుల్, స్టైలిష్ మాస్ అవతార్‌లో ప్రజెంట్ చేసిన ఈ గ్లింప్స్‌కు భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ మోడ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. బాలకృష్ణ, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణను మరింత స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా చూపించేందుకు గోపీచంద్ మలినేని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట.
మరోవైపు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన టైటిల్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ‘వీరసింహా రెడ్డి’ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్, గ్యాంగ్‌స్టర్ టచ్, బాలయ్య పవర్ఫుల్ మాస్ అవతార్ కలవడంతో ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.