సత్య, వెన్నెల కిశోర్ లీడ్ రోల్లో రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెట్లీ’. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సత్య, వెన్నెల కిశోర్ డైనమిక్ గా నడుస్తూ వస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మత్తు వదలరా’ మూవీకి వర్క్ చేసిన మెయిన్ టీం ఈ సినిమాకు పని చేస్తున్నారు. మ్యూజిక్ కాల భైరవ, సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్‌తో కలిసి రితేష్ రానా మరోసారి తనదైన హాస్యాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు.





