చిరంజీవి చేతులమీదుగా ‘బ్రేకింగ్ న్యూస్’

ఈ టైటిల్ చూసి ఇదేదో నిజంగా బ్రేకింగ్ న్యూస్ అనుకునేరు. ఇదొక సినిమా టైటిల్. మీడియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ‘ది బ్రేకింగ్ న్యూస్’ టైటిల్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. సీనియర్ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను చూడటానికి ఎంతో ఈగర్‌‌గా వెయిట్‌ చేస్తున్నా. మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్‌ రోల్‌లో నేను ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు. అలాగే అనన్య నాగళ్ల నటనను కూడా ప్రశంసిస్తూ.. దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా, విభిన్నంగా తెరకెక్కించినట్లు తెలుస్తోందని చెబుతూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని అన్నారు. ఈ చిత్రం మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతోందని, ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు. సమ్మర్ స్పెషల్‌గా మే నెలలో థియేటర్స్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. శశి ప్రీతం సంగీతం అందిస్తుండగా, సాయినాథ్ సినిమాటోగ్రాఫర్‌‌గా, శిరీష్ ప్రసాద్ ఎడిటర్‌‌గా వ్యవహరిస్తున్నారు.

 

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని