మరోసారి మాస్ జాతరకు రెడీ అవుతోన్న ‘జైలర్ 2’

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అత్యంత ఆసక్తికర చిత్రం ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి కావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ ‘జైలర్’ ఘన విజయాన్ని సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’ మొదటి భాగం విడుదల సమయంలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించి, రజినీకాంత్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మేళవింపుతో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రజినీకాంత్ స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇదే ఊపుతో ఇప్పుడు ‘జైలర్ 2’ రూపొందుతుండటం విశేషం. సీక్వెల్ కథ మరింత ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తునన్నారు. ఫస్ట్ పార్ట్‌లోని పాత్రలను కొనసాగిస్తూ, కథను కొత్త మలుపులతో ముందుకు తీసుకెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, ట్విస్టులు ఈసారి మరింత హైలైట్ అవుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు నెల్సన్ తన స్టైల్‌కు తగ్గట్టుగా ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు గట్టి ఎమోషన్‌ను మేళవిస్తూ కథను రూపొందించాడట. అలాగే సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించడంతో విజువల్‌గా కూడా సినిమా గ్రాండ్‌గా ఉండబోతుంది.

తాజాగా షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ సెట్‌లో ఆఖరి రోజు టీమ్ అందరితో కలిసి ఓ పెద్ద కేక్‌ను కట్ చేసి సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ‘జైలర్’ సక్సెస్‌తో ఏర్పడిన హైప్ దృష్ట్యా, ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద మరింత భారీ విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. మొత్తంగా చెప్పాలంటే, రజినీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’ మరోసారి థియేటర్లలో మాస్ జాతర సృష్టించడానికి సిద్ధమవుతోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

మరోవైపు ఈ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తవడంతో రజినీకాంత్ ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుకు రెడీ అవుతున్నారు. దీనితర్వాత రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాణంలో ఓ చిత్రం ఇప్పటికే అనౌన్స్ చేయగా, దర్శకుల విషయంలో తీవ్ర కన్ఫ్యూజన్ నెలకొంది. దీనికి ముందుగా సుందర్ సి ను దర్శకుడిగా అనౌన్స్ చేశారు. అయితే కొన్ని రోజులకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నాడు. దీంతో ఆయన ప్లేస్ లోకి డాన్ డైరెక్టర్ శిబి చక్రవర్తిని ఫైనల్ చేశారు. ఈ కాంబో దాదాపు ఖాయమై ఈ నెలలో సెట్స్ కు వెళ్లాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు శిబి చక్రవర్తి కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లోకి అశ్వత్ మారిముత్తు ఎంటర్ అయ్యాడని తెలుస్తుంది. తమిళంలో ఓ మై కడవులే (తెలుగులో ఓరి దేవుడా రీమేక్) రూపొందించిన అశ్వత్ చేతికి ఈ భారీ ప్రాజెక్ట్ వెళ్ళిందని కోలీవుడ్ టాక్. కొన్నిరోజుల్లోనే ఈ చిత్ర దర్శకుడిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని