మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi హీరోగా, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి Anil Ravipudi దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణను సొంతం చేసుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్లు వసూళ్లు చేసి మెగాస్టార్ మూవీస్‌లో మైల్ స్టోన్‌లా నిలిచింది. తాజాగా ఈ చిత్రం విడుదలై నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం “ఆల్ టైమ్ రిజీనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్.. సెలబ్రేటింగ్ హండ్రెడ్ డేస్’’పేరుతో ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి తమ ఆనందాన్ని పంచుకుంది. అయితే రికార్డులు పరంగా, రివార్డులు పరంగా, రోజులు పరంగా అన్నీ బాగున్నాయి. కానీ ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో “100 రోజుల ఫంక్షన్” అనేది ఒక పెద్ద ఈవెంట్‌గా ఉండేది. ఏ సినిమా ఎన్ని సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసిందో ప్రత్యేకంగా ప్రచారం చేసుకునేవారు. పోస్టర్లపై కూడా “100 డేస్ ఇన్ 50 సెంటర్స్” వంటి ట్యాగ్‌లైన్‌లు కనిపించేవి. ఇది సినిమా విజయానికి ఒక ముఖ్యమైన ప్రమాణంగా పరిగణించబడేది.
అయితే కాలం మారడంతో సినిమా విడుదల విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు భారీగా థియేటర్లలో విడుదల, మొదటి వారంలోనే కలెక్షన్లు సాధించడం, ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ వంటి ట్రెండ్ ఎక్కువైంది. దీంతో సినిమాలు దీర్ఘకాలం థియేటర్లలో కొనసాగడం తగ్గిపోయింది. చాలా సినిమాలు రెండు నుంచి మూడు వారాల్లోనే థియేటర్ల నుంచి తప్పుకుంటున్నాయి. అందుకే “100 రోజులు” అనే మైలురాయి ఇప్పటి పరిస్థితుల్లో అరుదుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం 100 రోజుల మైలురాయిని చేరుకోవడం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. అయితే ఇది గతంలో మాదిరి భారీ సంఖ్యలో థియేటర్లలో కొనసాగిందనే అర్థం కాదు. ప్రస్తుతం ఈ మైలురాయి ఎక్కువగా ప్రతీకాత్మకంగా, సినిమా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునే ఒక సందర్భంగా మారింది. మొత్తంగా చూస్తే, కాలం మారినా “100 రోజులు” అనే ఫీలింగ్ మాత్రం ఇంకా తగ్గలేదు. అది ఇప్పుడు సంఖ్యల కంటే భావోద్వేగానికి, సెలబ్రేషన్‌కు సంబంధించిన ఒక గుర్తింపుగా నిలిచిపోయింది.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్ ముఖ్య పాత్రలో మెప్పించారు. కేథరీన్ థ్రెసా, జరీనా వహాబ్, హర్ష వర్ధన్, సచిన్ ఖేడ్కర్, శరత్ సక్సేనా, వైవా హర్ష, రఘు బాబు ఇతర పాత్రలతో ఆకట్టుకున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోరుకు మంచి రెస్పాన్స్ దక్కింది.





