యంగ్ టైగర్ ఎన్టీఆర్ Jr. NTR, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ Prashanth Neel కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఈ క్రేజీ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీయఫ్ చాప్టర్ 2 KGF Chapter 2 వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, యాక్షన్ మరియు మాస్ ఎలిమెంట్స్ మరో స్థాయిలో ఉండబోతున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్టీఆర్ బర్త్‌డే (మే 20)కు ఇంకా నెలరోజులు సమయం ఉండగానే ఇప్పట్నుంచే ఫ్యాన్స్ అంతా ఆయన అప్‌డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందించిన ఈ క్రేజీ
న్యూస్‌తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అలాగే బర్త్‌డే కానుకగా మే 20న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు కూడా ఈరోజు ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల జోర్డాన్ దేశంలో కీలక షెడ్యూల్‌ను చిత్రీకరించారు. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే మరింత లీన్ అండ్ రగ్గడ్ లుక్‌లో, ఒత్తైన గడ్డం, స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. హాలీవుడ్ స్థాయి భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రశాంత్ నీల్ చిత్రీకరించనున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టోవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నారు.
అయితే దీనితో సరిపెట్టకుండా బర్త్‌డే మరో ట్రిపుల్ ట్రీట్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించిన అనౌన్స్‌మెంట్లు ఇచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. వాటిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోపాటు ఆ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి గాడ్ ఆఫ్ వార్, షణ్ముఖుడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరోవైపు తమిళ డైరెక్టర్ వెట్రిమారన్, ఎన్టీఆర్ కాంబోను కూడా అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ గురించి గత కొన్నిరోజులుగా గాసిప్స్ వినిపిస్తుండగా దీనిపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర2’ గురించి కూడా క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి పుట్టినరోజు అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఎన్టీఆర్ నెల రోజుల ముందే ట్రీట్ ఇవ్వడం విశేషం.





