Haiku – A Heartfelt Love Story
ఏగన్, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హైకూ’ అక్టోబర్ 23న విడుదల కానుంది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు రామ్ జగదీశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Haiku – A Heartfelt Love Story
కోన వెంకట్ మాట్లాడుతూ.. “ట్రైలర్ చూడగానే ‘హైకూ’ చాలా కూల్‌గా, ఆహ్లాదకరంగా అనిపించింది. ఇదొక సిన్సియర్ లవ్ స్టోరీ. కాలేజీ జీవితంలోని అందమైన క్షణాలను గుర్తుచేస్తూ అందరినీ ఎగ్జైట్ చేస్తుంది. ప్రత్యేకంగా శ్రీదేవి కోసం ఈ సినిమా చూడాలి. ఏగన్కు తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్వాగతం” అన్నారు.
శ్రీదేవి మాట్లాడుతూ.. “ఈ కథ నా మనసుకు బాగా కనెక్ట్ అయింది. ప్రేమలో ఉన్నవారితో పాటు రిలేషన్షిప్లో ఉన్నవారు, వివాహితులు కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. టీమ్ సహకారంతో సినిమా చక్కగా వచ్చింది. అక్టోబర్ 23న థియేటర్లలో చూసి ఆదరించండి” అని కోరారు.
ఏగన్ మాట్లాడుతూ..“హైకూ నా మనసుకు దగ్గరైన సినిమా. టీమ్ ఎంతో కష్టపడి పనిచేసింది. సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. దర్శకుడు యువరాజ్ చిన్నసామితో పదేళ్ల పరిచయం తర్వాత కలిసి సినిమా చేయడం సంతోషంగా ఉంది” అన్నారు.

దర్శకుడు రామ్ జగదీశ్ మాట్లాడుతూ.. “తమిళంలో రూపొందిన ‘హైకూ’ ఇప్పుడు తెలుగులో విడుదలవుతోంది. శ్రీదేవి ఈ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టారు. ఆమె నటన, సినిమా అవుట్‌పుట్ ఆకట్టుకునేలా ఉన్నాయి. యువత ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతారు” అన్నారు.