రివ్యూ : ‘గోదారి గట్టుపైన ’ పాజిటివ్ ఫ్యామిలీ డ్రామా

రివ్యూ : ‘గోదారి గట్టుపైన ’ పాజిటివ్ ఫ్యామిలీ డ్రామా

నటీనటులు :- సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతిబాబు, లైలా, నెల్లూరు సుదర్శన్, దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్ తదితరులు..
దర్శకత్వం : సుభాష్ చంద్ర
రచయితలు : సుభాష్ చంద్ర, అనురాగ్ కౌతూరి
నిర్మాత : అభినవ్ రావ్
సినిమాటోగ్రఫీ : సాయి సంతోష్
ఎడిటర్ : అనిల్ పసల
మ్యూజిక్ -: నాగవంశీ
విడుదల తేదీ : మే 8, 2026
నిడివి : 148 నిమిషాలు

‘మేం ఫేమస్’ చిత్రంతో హీరోగా దర్శకుడిగా తొలి సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్.. మూడేళ్ల తర్వాత ‘గోదారి గట్టుపైన’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకూతుళ్ల అనుబంధం, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో రూపొందిన ఈ చిత్రం ఏమేరకు ఆడియెన్స్‌ను ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే…
సెక్యూరిటీ గార్డ్ శ్యామ్ బాబుకు (జగపతిబాబు) తన కూతురు మాయ (నిధి ప్రదీప్) అంటే పంచప్రాణాలు. తన కూతురు జీవితంలో చిన్న బాధ కూడా రాకూడదని ప్రతి అడుగులో ఆమెను కాపాడుతూ, తన ప్రపంచాన్నంతా ఆమె చుట్టూనే నిర్మించుకుంటాడు. కూతురులోనే తన ఆనందాన్ని చూసుకుంటాడు. అంతలా ఆమెను చూసుకుంటాడు. అలాంటి సమయంలో ఆ అమ్మాయి జీవితంలోకి ఆటో డ్రైవర్ రాజు (సుమంత్ ప్రభాస్) వస్తాడు. సాధారణ జీవితం గడిపే రాజులో నిజాయితీని చూసి ఆమె ప్రేమలో పడుతుంది. కూతురు తీసుకున్న ఈ నిర్ణయం తండ్రి మనసులో అలజడి రేపుతుంది. తన కూతురి భవిష్యత్తు గురించి కలిగే ఆందోళన ఒకవైపు, ఆమె ఆనందమే తనకు ముఖ్యం అనే తండ్రి మనసు మరోవైపు నిలుస్తాయి. అయితే వీరి కులాలు వేరు అవడంతో ఆటో డ్రైవర్ రాజు ప్రేమను ఒకానొక సందర్భంలో కాదనుకుని తనకు కనబడకుండా దూరంగా వెళ్లిపోతుంది. మాయను వెతుక్కుంటూ ఆమె దగ్గరకు చేరతాడు రాజు. మరోవైపు కూతురిలో వచ్చే మార్పులను గమనిస్తూ బాధపడుతుంటాడు శ్యామ్ బాబు. మరి వీరి ప్రేమను శ్యామ్ బాబు ఒప్పుకున్నాడా, రాజు తను ప్రేమించిన మాయను దక్కించుకున్నాడా అన్నదే ఈ కథ సారాంశం.

ఎవరెలా చేశారంటే…
ఆటో డ్రైవర్ రాజు పాత్రలో సుమంత్ ప్రభాస్ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా తను తెలంగాణ కుర్రాడు అయినా.. గోదావరి యాసను చక్కగా పలికాడు. తనదైన హావభావాలు, మేనరిజంతో మెప్పించాడు. మాయ క్యారెక్టర్‌‌లో ఇన్నోసెంట్‌గా కనిపిస్తూనే గ్లామర్‌‌లుక్‌లో ఆకట్టుకుంది నిధి ప్రదీప్. మొదటి చిత్రమే అయినా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. అలాగే సెక్యూరిటీ గార్డ్ శ్యామ్ బాబు పాత్రలో జగపతిబాబు నటన రియాల్టీకి దగ్గరగా ఉంటుంది. తనదైన నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో ఆయన మెప్పించారు. శ్యామ్ బాబు భార్య ఝాన్సీగా నటించిన సీనియర్ హీరోయిన్ లైలా రోల్ స్ర్కీన్ ప్రెజెన్స్‌కు మాత్రమే పరిమితమైంది. ఆటో డ్రైవర్ రాజు తండ్రి ఆనందరావుగా దేవి ప్రసాద్ తన పరిధిమేర నటించారు. ఇక రాజు ఫ్రెండ్‌గా రెహమాన్ పాత్ర పోషించిన నెల్లూరు సుదర్శన్ తనదైన పంచ్ డైలాగులతో నవ్వులు పూయించాడు. రాబర్ట్‌గా రాజ్ కుమార్ కసిరెడ్డి, ప్రకాష్‌గా రాజీవ్ కనకాల పాత్రలు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తాయి. రాజు మరదలు కనకమహాలక్ష్మీగా రీనూ నటించిన తీరు మెప్పిస్తుంది.

ఎలా ఉందంటే..
వాస్తవానికి ఇలాంటి కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. కానీ కథనంలో కాస్తంతా కొత్తదనం చూపిస్తూ తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్‌తో ఎమోషన్స్‌ పండించారు. కూతురంటే ప్రాణం పెట్టే ఒక తండ్రి భావోద్వేగాలే కథకు ప్రధాన బలం. తండ్రి ప్రేమలో ఉన్న ఆ ఆప్యాయత, ఆందోళన, బాధ్యత కథను సహజంగా ముందుకు తీసుకెళ్తాయి. అయితే హీరో హీరోయిన్‌ను చెంప దెబ్బకొట్టగానే లవ్‌లో పడిపోవడం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. అలా ఫస్టాఫ్ అంతా లవ్‌స్టోరీతో నడిపినా.. సెకండ్ హాఫ్‌లో కుటుంబ బంధాలు, అనుబంధాల విలువలను హార్ట్‌ఫుల్‌గా చూపించారు. గోదావరి ఒడ్డున సాగే ఈ కథలో తండ్రి– కూతురు అనుబంధం, ప్రేమ కోసం తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల కుటుంబంలో వచ్చే మార్పులు ప్రేక్షకులను కదిలించేలా ఉంటాయి. గోదావరి నదీ తీరంలోని వేల్పూరు, రేలంగా గ్రామాలను చూపిస్తూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన విజువల్స్ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. నెల్లూరు సుదర్శన్ కామెడీ బాగానే వర్కవుట్ అయ్యింది. సుదర్శన్ కామెడీ లేకపోతే సినిమా మరింత బోరింగ్‌గా ఉండేది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు తన కామెడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సాంగ్స్ వినేటప్పుడు బాగున్నా.. గుర్తుపెట్టుకునేంత ఉండవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఓకే అనిపిస్తుంది. ప్రేమకు కులం, మతం, డబ్బు అనేవి అవసరం కావని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు సుభాష్ చంద్ర. ‘నాన్న హిందూ, అమ్మ ముస్లిం, కోడలు క్రిస్టియన్’ అంటూ అన్ని మతాలను గౌరవించేలా ఉన్న ఓ సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే ‘అతను ఫ్యాక్టరీకి కాదు.. కుటుంబానికి సెక్యూరిటీ గార్డ్‌’, ‘అమ్మ బాగుంటేనే. ఇల్లు బాగుంటుంది’ అనే డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉంటాయి. దర్శకుడు సుభాష్ చంద్ర కథను అతిగా మెలోడ్రామా వైపు తీసుకెళ్లకుండా, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా తెరకెక్కించారు. గోదావరి నేపథ్యం సినిమాకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగిన భావన ఉన్నా, భావోద్వేగాల బలం ఆ చిన్న లోపాన్ని కప్పిపుచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్ :
ఫ్యామిలీ ఎమోషన్స్
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోని విజువల్స్
సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ పెర్ఫార్మెన్స్‌లోని ఫ్రెష్‌ నెస్
నెల్లూరు సుదర్శన్ కామెడీ

మైనస్ పాయింట్స్ :
కథలో కొత్తదనం లేకపోవడం
సిల్లీగా అనిపించే కొన్ని సన్నివేశాలు

మొత్తంగా చూస్తే, గోదారి గట్టుపైన ప్రేమకథ మాత్రమే కాదు; తండ్రి–కూతురు అనుబంధం, కుటుంబ విలువలు, మనసు గెలిచే భావోద్వేగాల కలయిక. పెద్ద హంగామా లేకపోయినా, హృదయానికి హత్తుకునే పాజిటివ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా నిలుస్తుంది.

రేటింగ్ : 3.5/5

Related Posts

‘కాంతార’ రేంజ్ కథ అనుకున్నారు కానీ.. ‘వీరభద్రుడు’ సరిహద్దులు దాటలేడు

suriya veerabhadrudu movie review : రివ్యూ: వీరభద్రుడు (Veerabhadrudu) నటీనటులు: సూర్య, ఆర్‌జే బాలాజీ, త్రిష, ఇంద్రాన్స్, నట్టి సుబ్రమణ్యం, సుప్రీత్ తదితరులు సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు సంగీతం: సాయి అభ్యంకర్ ఎడిటర్: కళైవాణన్ నిర్మాతలు: ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్…

రివ్యూ : ‘‘సతీ లీలావతి’’ చూడటం సాహసం చేయడమే

రివ్యూ : ‘‘సతీ లీలావతి’’ చూడటం సాహసం చేయడమే నటీనటులు : లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్, మడోన్నా సెబాస్టియన్, వీకే నరేష్, వీటీవీ గణేష్, మెట్ట రాజేంద్రన్, సప్తగిరి, తాగుబోతు రమేష్ తదితరులు. దర్శకత్వం : తాతినేని సత్య…

One thought on “రివ్యూ : ‘గోదారి గట్టుపైన ’ పాజిటివ్ ఫ్యామిలీ డ్రామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

పెద్ది ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

  • By Nani
  • May 18, 2026
  • 3 views
పెద్ది  ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ .. ముంబై నుంచి లైవ్

కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

  • By Nani
  • May 18, 2026
  • 8 views
కమల్ హాసన్, శివకార్తికేయన్ కాంబోలో రెండో చిత్రం ప్రారంభం

చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

  • By Nani
  • May 17, 2026
  • 4 views
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్.. ఆయన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన నిర్మాత

ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

  • By Nani
  • May 17, 2026
  • 5 views
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ‘పురుష:’ చేశా

‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

  • By Nani
  • May 17, 2026
  • 12 views
‘మెగా 158’కు ముహూర్తం ఫిక్స్

రాజస్థాన్‌లో ‘వృషకర్మ’

  • By Nani
  • May 17, 2026
  • 7 views
రాజస్థాన్‌లో ‘వృషకర్మ’