Epic: First Semester September 11 Release
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ’90స్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హసన్ ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Epic: First Semester September 11 Release
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేస్తూ, “అత్యంత అందమైన ప్రయాణాలు ఎప్పుడూ అత్యంత సాధారణమైన క్షణాలతోనే మొదలవుతాయి” అనే క్యాప్షన్‌తో సెప్టెంబర్ 11న సినిమా థియేటర్లలోకి వస్తోందని ప్రకటించారు. వినాయక చవితి సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ తేదీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ప్రచార చిత్రాల ద్వారా చూస్తే, విదేశీ నేపథ్యంలోని రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘బేబీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ–వైష్ణవి చైతన్య జోడీ మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.