CULT Trailer: Vishwak Sen’s Deadly Survival Game
మాస్ కా దాస్ విశ్వక్సేన్ మరోసారి డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్‌ప్లే అందించి దర్శకత్వం వహించిన గ్లోబల్ స్లాషర్ థ్రిల్లర్ ‘#CULT’ ‘#కల్ట్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మించిన ఈ చిత్రం.. డెడ్లీ సర్వైవల్ గేమ్స్, హై-వోల్టేజ్ యాక్షన్, ఇంటెన్స్ డ్రామాతో ఆసక్తి పెంచుతోంది.
CULT Trailer: Vishwak Sen’s Deadly Survival Game
గోవాలోని ఓ నిర్మానుష్య ఐలాండ్ ఎస్టేట్‌లో 300 మందికి పైగా చిక్కుకుపోవడం, చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, బయటకు వెళ్లే మార్గాలను మూసివేయడం వంటి అంశాలతో ట్రైలర్ ఉత్కంఠభరితంగా మొదలవుతుంది. అక్కడి నుంచి బయటపడాలంటే ప్రాణాంతకమైన గేమ్స్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డేంజరస్ గేమ్స్‌లో ఎవరు నిలబడతారు? ఎవరు ప్రాణాలు కోల్పోతారు? అనే ప్రశ్నలతో కథపై క్యూరియాసిటీ పెరుగుతుంది.
ట్రైలర్లో విశ్వక్సేన్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డ్రగ్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నేరస్థులను తనదైన శైలిలో ఎదుర్కొనే కఠినమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. మాస్ యాటిట్యూడ్, హ్యూమర్, యాక్షన్‌తో కూడిన ఆయన పాత్ర సినిమా డార్క్ బ్యాక్‌డ్రాప్‌కు భిన్నమైన టచ్ ఇస్తోంది. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించారు.
స్లాషర్ థ్రిల్లర్‌కు అవసరమైన ప్రమాదకరమైన వాతావరణం, ఉత్కంఠభరితమైన విజువల్స్, వేగవంతమైన ఎడిటింగ్ ట్రైలర్లో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. తరుణ్ భాస్కర్ డైలాగ్స్, రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథలోని డార్క్‌నెస్‌ను మరింత ఎలివేట్ చేస్తున్నాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ‘#CULT’ను చాలా నిజాయితీగా, అందరూ కష్టపడి రూపొందించిన చిత్రం. సినిమా మొదటి ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రెండు గంటల 20 నిమిషాల పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. యాక్షన్‌తో పాటు డ్రామాకు ప్రేక్షకులు బలంగా కనెక్ట్ అవుతారు. కథ గ్లోబల్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో జపనీస్, స్పానిష్ భాషల్లోనూ సినిమాను డబ్ చేస్తున్నాం’ అని చెప్పారు.
ఇక నటులు కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, ఈజీ ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇదని కార్తికేయ పేర్కొనగా, ట్రైలర్‌కు మించిన అనుభూతి ప్రేక్షకులకు లభిస్తుందని తారక్ పొన్నప్ప అన్నారు. ఇక ఈ చిత్రంలో విశ్వక్ విశ్వరూపం చూస్తారని, అక్టోబర్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని నిర్మాత సందీప్ కాకరాల అన్నారు.