ఒకరికి మూడేళ్లు.. మరొకరికి ఎనిమిదేళ్లు గ్యాప్‌.. క్రేజీ కాంబో

బెల్లంకొండ గణేష్ హీరోగా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. బెల్లంకొండ ఫ్యామిలీకి ఇప్పటికే కథ వినిపించగా, అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ ఎవరనేది తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల్లోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన వస్తుంది. ప్రేమకథా చిత్రాలు రూపొందించడంలో దిట్ట అయిన కరుణాకరన్.. గణేష్ కోసం ఓ ఫీల్ గుల్ లవ్‌స్టోరీని సిద్ధం చేశారట. అయితే చాలా గ్యాప్ తర్వాత, కరుణాకరన్ ఈ చిత్రాన్ని రూపొందించడం, అలాగే స్వాతిముత్యం, నేను స్టూడెంట్ సర్ లాంటి ఫెయిల్యూర్స్‌ తర్వాత వీరి కాంబోలో సినిమా అంటే ప్రస్తుతానికి ఎలాంటి అంచనాలు లేవనే చెప్పాలి. ఇక దర్శకుడు కరుణాకరన్ సినిమాల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్స్‌లో ఒకటైన ‘తొలిప్రేమ’ చిత్రంతో దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకుని, మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్స్ సరసన చేరారు. అయితే ఆ తర్వాత తెరకెక్కించిన యువకుడు, వాసు, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవలేదు. కానీ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌, లవ్ ఎంటర్‌‌టైనర్స్‌ తో యూత్‌ను ఆకట్టుకున్నాయి. చివరగా సాయి ధరమ్ తేజ్‌తో ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా చేశాడు. ఈ సినిమాకు చేదు అనుభవమే ఎదురైంది. దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పడుతున్నారు. ఈ చిత్రం తనతోపాటు హీరో బెల్లంకొండ గణేష్‌కు కూడా చాలా ముఖ్యమైన సినిమాగా చెప్పుకోవాలి. ఇద్దరికీ కచ్చితంగా సక్సెస్‌ కావాల్సిన మూవీ ఇది. మరి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.!

Related Posts

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్‌ను కాస్త కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తుండటంతో అసలు ఎవరు…

‘దేవర 2’ పక్కనపెట్టి.. బాలయ్యతో బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసిన కొరటాల

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. నటసింహం బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌‌తో జనతా గ్యారేజ్, దేవర వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని