Allari Naresh Alcohol Release Date Locked
కథల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ వరుస ప్రయోగాలు చేస్తున్న హీరో అల్లరి నరేష్ మరోసారి సరికొత్త అవతారంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్కహాల్’ విడుదల తేదీ ఖరారైంది. డిసెంబర్ 18న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
Allari Naresh Alcohol Release Date Locked
సాధారణ కమర్షియల్ కథలకు భిన్నంగా మానవ మనస్తత్వాలు, నేర ప్రవృత్తి, వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు వాటి ప్రభావాల చుట్టూ ఈ సినిమా కథనం సాగనుంది. మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయడం నుంచే సినిమాపై క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్‌ను గతంలో ఎన్నడూ చూడని స్టైలిష్ లుక్‌లో చూపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ చిత్రంలో రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తుంది. నిహారిక ఎన్ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి దామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జీబ్రాన్ సంగీతం అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విశాల్ అబాని ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.