Ajay Arasada’s Trendy Ganesh Anthem ‘Bolo Ganapathi’ Out Now
వినాయక చవితి వచ్చిందంటే భక్తి పాటలతో పాటు సందడి చేసే మ్యూజిక్ కూడా గుర్తొస్తుంది. ఈసారి ఆ సెలబ్రేషన్‌కు మరింత యూత్‌ఫుల్ టచ్ ఇచ్చేలా ప్రముఖ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ సరికొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రూపొందించిన ‘బోలో గణపతి S/O ఉమాపతి’ స్పెషల్ సింగిల్ తాజాగా విడుదలైంది.
Ajay Arasada’s Trendy Ganesh Anthem ‘Bolo Ganapathi’ Out Now
గణపతిని భక్తితో కొలుస్తూనే.. అదే సమయంలో యూత్‌తో కలిసి స్టెప్పులేయించేలా ఈ పాటను డిజైన్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పెప్పీ బీట్స్, ఎనర్జిటిక్ వోకల్స్, క్యాచీ లిరిక్స్‌తో సాగిపోయే ఈ సాంగ్‌లో భక్తి, మోడ్రన్ మ్యూజిక్ రెండింటినీ బ్యాలెన్స్ చేశారు.
‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి ప్రాజెక్ట్స్‌తో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ.. ఈ స్పెషల్ సాంగ్‌ను కేవలం రెండు రోజుల్లోనే కంపోజ్ చేయడం విశేషం. పాటకు అజయ్ అరసాడ సంగీతం అందించడమే కాకుండా, తన సొంత మ్యూజిక్ లేబుల్ AjA Recordsపై స్వయంగా నిర్మించారు. దీంతో సంగీత దర్శకుడిగా తన ప్రయాణంలో మరో అడుగు ముందుకేసిన ఆయన.. నిర్మాతగానూ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.
‘బోలో గణపతి S/O ఉమాపతి’లో ప్రధానంగా ఆకట్టుకునే అంశం భక్తి గీతానికి ఇచ్చిన ట్రెండీ ట్రీట్మెంట్. తెలుగు సాహిత్యానికి సంస్కృత పదాలను జోడించడంతో పాటు, సందర్భానికి తగ్గట్టుగా ఇంగ్లీష్ పదాలను కూడా సహజంగా జోడించారు. దీంతో పాట సంప్రదాయ భక్తి గీతంలా కాకుండా.. నేటి జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఫ్రెష్ సాంగ్లా అనిపిస్తుంది.
భాస్కర్ తిరుమల అందించిన సాహిత్యం సింపుల్‌గా, ట్రెండీగా ఉండటంతో పాటు పాటకు కావాల్సిన ఎనర్జీని అందిస్తోంది. జయరామ్ పైలా, సింధూజ రాజేష్ ఎనర్జిటిక్ వోకల్స్ పాటకు మరింత జోష్‌ను తీసుకొచ్చాయి. లిరికల్ వీడియోలో కూడా కొత్తదనం కనిపిస్తుంది. పాట కంపోజిషన్‌కు సంబంధించిన విజువల్స్‌తో పాటు, లిరిక్స్‌కు తగ్గట్టుగా కనిపించే గణేష్ మహారాజ్ పెయింటింగ్ ఫ్రేమ్స్ వీడియోకు ప్రత్యేకమైన లుక్‌ను తీసుకొచ్చాయి.
విశాఖపట్నానికి చెందిన అజయ్ అరసాడ సంగీత ప్రపంచంలోకి రాకముందు టీసీఎస్‌లో ఏడు సంవత్సరాలు పనిచేశారు. తనకు ఎంతో ఇష్టమైన సంగీతాన్ని కెరీర్‌గా ఎంచుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. విభిన్న జానర్స్‌లో పనిచేస్తూ తనదైన ముద్ర వేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా కలిసిన సందర్భంలో అజయ్ అరసాడను అభినందించడంతో పాటు, భవిష్యత్తులో కలిసి పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేయడం కూడా ఆయన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది.