Venkatesh Adarsha Kutumbam AK47 Teaser
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ క్రేజీ కాంబినేషన్‌పై భారీ ఆసక్తి నెలకొనగా.. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. కుటుంబ కథ, కామెడీ, యాక్షన్‌తో పాటు త్రివిక్రమ్ శైలిలోని పంచ్ డైలాగ్స్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
టీజర్‌ను చూస్తే.. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం చుట్టూ కథ నడుస్తున్నట్లు తెలుస్తోంది. అప్పులు, కుటుంబ బాధ్యతలు, చిన్న చిన్న సమస్యలతో సర్దుకుపోతూ జీవించే ఆ కుటుంబానికి లాటరీ తగిలి అనూహ్యంగా పరిస్థితులు మారిపోతాయి. సాధారణ జీవితంలో ఉన్న వారు ఒక్కసారిగా విల్లా, బెంజ్ కారు అంటూ లావిష్ లైఫ్‌లోకి అడుగుపెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ మార్పు వెనుక అసలు కథ ఏమిటనేది టీజర్లో పూర్తిగా రివీల్ చేయకుండా సినిమాపై సస్పెన్స్‌ను కొనసాగించారు. కుటుంబంపై దాడి జరిగిన తర్వాత వెంకటేష్ పాత్ర యాక్షన్ మోడ్‌లోకి మారడం టీజర్లో హైలైట్‌గా కనిపించింది.
Venkatesh Adarsha Kutumbam AK47 Teaser
‘నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని నాకు తెలుసు.. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి కూడా వెనకాడను..’ అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ ఆయన పాత్రలోని మరో కోణాన్ని పరిచయం చేస్తోంది. ఇక ‘నది గట్టు దాటితే వరద అంటారు.. సముద్రం దాటితే ఉప్పెన అంటారు.. కానీ సామాన్యుడు దాటితే.. బలమైన పదం, స్ట్రాంగ్ సౌండ్ వచ్చేది మీరే వెతకండి సార్’ అంటూ వెంకీ చెప్పే డైలాగ్ త్రివిక్రమ్ మార్క్ రైటింగ్‌ను గుర్తు చేస్తోంది.
మరోవైపు వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో టీజర్లో నవ్వులు పూయించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ సన్నివేశాల మధ్య ఒక్కసారిగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాను ఏ తరహాలో తెరకెక్కించారనే ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత ఎనర్జీని తీసుకొచ్చింది.
వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. సంగీతం థమన్ ఎస్, సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ ఏ.ఎస్. ప్రకాష్ నిర్వహిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్‌కు ఉన్న ఫ్యామిలీ హీరో ఇమేజ్ను, త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనింగ్ రైటింగ్‌ను కలిపి రూపొందుతున్న ఈ సినిమా.. కామెడీతో పాటు యాక్షన్‌ను కూడా సమపాళ్లలో అందించబోతున్నట్లు టీజర్ స్పష్టం చేసింది.
మొత్తంగా ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ చూస్తే.. పేరుకు తగ్గట్టుగా కుటుంబ కథతో మొదలై, ఊహించని మలుపులతో యాక్షన్ ఎంటర్టైనర్గా మారేలా సినిమా ఉండబోతుందనే ఆసక్తి కలుగుతోంది. వెంకటేష్ కామెడీ, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారీ తారాగణం సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ‘ఆదర్శ కుటుంబం – AK47’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.