Surgery on Ram Charan hand on Monday :
చరణ్ చేతికి సోమవారం ఆపరేషన్..
గాయాలైనా షూటింగ్ ఆపలేదు
చరణ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్..
Surgery on Ram Charan hand on Monday :
రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ప్రెస్టిజీయస్ ప్రాజెక్టు ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కోసం చరణ్ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఈ చిత్రంలో క్రికెట్‌తోపాటు ఫహిల్వాన్గా కనిపించేందుకు తీవ్రంగా శ్రమించారు. స్పెషల్ ట్రైనర్ దగ్గర శిక్షణ తీసుకుంటూ షూటింగ్లో పాల్గొన్న మొత్తం షూట్లో భాగంగా ఆయనకు మూడు గాయాలు అయ్యాయని చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన చేతి మణికట్టుకు ఆపరేషన్ జరగనుందని తెలియజేశారు. జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత వెంకట సతీష్ మీడియా ముచ్చటిస్తూ.. సినిమా పట్ల చరణ్ డెడికేషన్‌కు హ్యాట్సప్ అని అన్నారు. ఈ విషయంలో ఆయన మాట్లాడుతూ ‘‘చరణ్‌కు షూటింగ్ సమయంలో మూడు గాయాలు అయ్యాయి. కంటికి గాయం అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన మణికట్టుకు కూడా తీవ్రంగా గాయమైంది. మణికట్టు లోపల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎంతో కష్టపడి షూటింగ్ పూర్తి చేశారు. షూట్ సమయంలో ఆయన పక్కనే ఫిజియోథెరపిస్ట్‌ను ఉంచుకొని, గ్యాప్ వచ్చినప్పుడల్లా అక్కడే ఫిజియో, వర్కౌట్స్ చేసేవారు. కుస్తీ సన్నివేశాల చిత్రీకరణలో పలుమార్లు కండరాలు పట్టేసినా, వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ షూట్లో పాల్గొన్నారు. అదేవిధంగా కాలుకు కూడా గాయం అయింది. అయినా ప్రొఫెషనల్ కమిట్మెంట్తో చరణ్ షూటింగ్ కొనసాగించారు” అని తెలిపారు.
Surgery on Ram Charan hand on Monday :
ఇటీవల ముంబైలో కనిపించిన చరణ్ చేతికి కట్టు ఉండటంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే అది ఫిజియోథెరపీ అనంతరం తాత్కాలికంగా వేసిన సపోర్ట్ మాత్రమేనని అనుకున్నారు. కానీ ఆయన చేతి మణికట్టుకు సరర్జీ జరుగుతుందని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సోమవారం ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముగిసిన తర్వాత ఆయన మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారని తెలుస్తోంది. దీంతో మెగాభిమానులు మొత్తం చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.




