Vrushakarma shooting in Rajasthan :
‘తండేల్’ చిత్రంలో తనదైన పెర్ఫార్మెన్స్తో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న యువ సామ్రాట్ నాగ చైతన్య.. ఇప్పుడు మరో విభిన్నమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మిస్టరీ, మైథాలజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన నటిస్తున్న చిత్రం ‘వృషకర్మ’, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘విరూపాక్ష’తో డిఫరెంట్ వరల్డ్‌ను క్రియేట్ చేసిన దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మిథికల్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన బీహైండ్ ది సీన్స్ స్టిల్స్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ లభించగా, అది 20 మిలియన్ వ్యూస్ దాటి సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
Vrushakarma shooting in Rajasthan :
తాజాగా రాజస్థాన్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌కు సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. పురాతన రాజభవనాలు, అద్భుతమైన శిల్పకళ మధ్య చిత్రీకరించిన కీలక సన్నివేశాలు సినిమాకి ఉన్న భారీ విజువల్ స్కేల్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. నాగచైతన్య, మీనాక్షి చౌదరి సహా కీలక పాత్రధారులంతా పాల్గొన్న ఈ షెడ్యూల్ కథలో అత్యంత కీలకంగా నిలవనుందని తెలుస్తోంది. విడుదలైన స్టిల్స్‌లో కనిపిస్తున్న మిస్టిక్ టోన్, డార్క్ విజువల్ టెక్స్చర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. భారీ స్థాయిలో సీజీ, విజువల్ ఎఫెక్ట్స్‌తో భారతీయ ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త సినీమాటిక్ అనుభూతిని అందించేందుకు టీమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మైథలాజికల్ ఎలిమెంట్స్‌ను రిచ్ డీటైలింగ్, ఇమర్సివ్ వరల్డ్ బిల్డింగ్‌తో అద్భుతంగా తెరపై ఆవిష్కరించేందుకు మేకర్స్ పని చేస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రాఫర్ రాగుల్ డి హెరియన్ విజువల్ గ్రాండియర్‌ను హ్యాండిల్ చేస్తుండగా, అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల ఈ మిస్టిక్ ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పవర్ఫుల్ కాంబినేషన్, భారీ సాంకేతిక ప్రమాణాలు, మైథలాజికల్ టచ్‌తో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ స్కేల్, మిస్టరీ, విజువల్ గ్రాండియర్ కలయికగా నిలవబోతోంది. త్వరలోనే ఈ చిత్ర థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.




