Global Craze for the ‘Virosh’ Couple… Another Record on Instagram :
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా చేసిన యాడ్స్ సోషల్ మీడియాలో మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. అభిమానులు ప్రేమగా “విరోష్” అని పిలిచే ఈ జోడీ తాజాగా చేసిన Airbnb కపుల్ యాడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్‌కు పైగా లైక్స్ సాధించి గ్లోబల్ స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కూడా ఈ లైక్స్ సంఖ్య పెరుగుతూనే ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఒక యాడ్ పోస్ట్‌కు వచ్చిన సెకండ్ హయ్యెస్ట్ లైక్స్‌గా ఇది నిలిచింది. ఇక ఫస్ట్ హయ్యెస్ట్ లైక్డ్ యాడ్ పోస్ట్ కూడా ఇదే విరోష్ జంటదే కావడం మరింత ఆసక్తికరం. వీరి వెడ్డింగ్ థీమ్‌తో చేసిన Manyavar కపుల్ యాడ్ 11.5 మిలియన్‌కు పైగా లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సెట్ చేసింది. ఆ పోస్ట్‌కు 104 మిలియన్ వ్యూస్ రావడం కూడా మరో అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు.
Global Craze for the ‘Virosh’ Couple… Another Record on Instagram :
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు Lionel Messi, Cristiano Ronaldo కలిసి చేసిన Louis Vuitton యాడ్కంటే ఎక్కువ లైక్స్ విరోష్ జంట యాడ్‌కు రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రికార్డు స్థాయి స్పందనతో విజయ్–రశ్మిక జోడీకి గ్లోబల్ రీచ్ మరింత పెరుగుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ రశ్మిక మందన్న జంట త్వరలో ‘రణబాలి’ Ranabali చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.





