దాదాపు 27 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది అందాల తార త్రిష. ఇప్పటికీ అదే అందం, మరింత గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె సోమవారం పుట్టినరోజు సందర్భంగా సినీ వర్గాల నుంచి శుభాకాంక్షల వెల్లువ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న పలు చిత్రాల నుంచి మేకర్స్ స్పెషల్ పోస్టర్స్ విడుదల చేసి బర్త్‌డే విషెస్ తెలిపారు. ముఖ్యంగా చిరంజీవి సరసన త్రిష నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ డ్రెస్‌లో హారతి ప్లేటుతో చిరు నవ్వుల చిందిస్తున్న త్రిష లుక్ ఎంతో అందంగా ఉంది. ఇందులో ఆమె ‘అవని’ పాత్రలో కనిపించనుంది. ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. జులైలో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే సూర్యకు జోడీగా త్రిష నటిస్తున్న ‘కరుప్పు’ చిత్రం నుంచి కూడా ప్రత్యేక పోస్టర్ విడుదలైంది. గ్రీన్ శారీలో త్రిష లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు ఆర్జే బాలాజీ ఈ చిత్రాన్ని రూపొందించగా, ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. మే 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు త్రిష పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఉదయమే తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. తర్వాత విజయ్ ఇంటికి చేరుకుంది. తమిళనాడు ఎలక్షన్స్‌లో ఆయన సాధించిన ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్లింది. ఈ విజయోత్సవ వేళ ఆయనకు సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విజయ్ సాధించిన ఈ విజయానికి త్రిష కూడా ఒక ముఖ్య భాగస్వామిగా నిలిచిందనే వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ త్రిష మధ్య ఉన్న స్నేహం, స్క్రీన్‌పై వారి కెమిస్ట్రీ గురించి ఇప్పటికే ఎన్నోసార్లు చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ విజయ వేళ త్రిష ప్రత్యక్షంగా వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అభిమానులు కూడా ఈ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విజయ్ రెండు చోట్ల గెలవగా, ఏదో ఒక నియోజకవర్గంలో రాజీనామా చేసి ఆ ప్లేస్‌లో త్రిషను గెలిపించి ఆమెకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఇవ్వనున్నారనే ప్రచారం చేస్తున్నారు.






