రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టాలీవుడ్‌లో యంగ్ టాలెంట్‌కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ మరో ఆసక్తికరమైన కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  స్టార్‌ యాంకర్  సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోషన్ కనకాల, తన తొలి చిత్రాలైన బబుల్‌గమ్, మోగ్లీతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో రెడీ అవుతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం, రోషన్ కనకాల తన కొత్త సినిమాను యంగ్ డైరెక్టర్ విజయ్ కామిశెట్టి దర్శకత్వంలో చేయబోతున్నాడు. దర్శకుడిగా ఇది విజయ్‌కు డెబ్యూ ప్రాజెక్ట్ కావడం విశేషం. అయితే, ఆయన ఇప్పటికే  టైగర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి విభిన్నమైన చిత్రాల రూపకల్పనలో అసోసియేట్ డైరెక్టర్‌‌గా  కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రానికి కో-డైరెక్టర్‌గా, డైలాగ్ రైటర్‌గా వర్క్ చేస్తున్న విజయ్, ఇప్పుడు దర్శకుడిగా తన టాలెంట్‌ను చాటుకునే  అవకాశం అందుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు మరో స్పెషల్ ఏమిటంటే.. ఈ సినిమాను దర్శకుడు  వీఐ ఆనంద్ నిర్మించబోతున్నారు. తన అసోసియేట్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన ముందుకొస్తుండటం ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది. కంటెంట్ పరంగా కూడా ఈ సినిమా కొత్తదనంతో ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.

రోషన్ కనకాల, విజయ్ కామిశెట్టి, వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం, యూత్‌ఫుల్ ఎనర్జీతో పాటు స్ట్రాంగ్ కంటెంట్‌ను అందించేలా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా , త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. టైటిల్, హీరోయిన్, టెక్నికల్ టీమ్ వంటి ఇతర వివరాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.
మొత్తానికి టాలీవుడ్‌లో మరో ఫ్రెష్ కాంబో రెడీ అవుతుండటం మరింత ఆసక్తిని రేపుతోంది.

 

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 2 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 9 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 5 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 6 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్