‘‘గాయపడ్డ సింహం’ సినిమా రిలీజ్ చేయకూడదని ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒత్తిడి
డైరెక్టర్ కశ్యప్ ఇండియాకు అమెరికాకు మధ్య గొడవ తీసుకొచ్చాడు
తరుణ్ భాస్కర్ హీరోగా కశ్యప్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాధినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ భన్సాల్ కలిసి నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్‌గా నటించగా, జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. మే 1న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ విసా స్టాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు అతిథిగా హాజరైన హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ఈ మూవీ టీమ్ అందరికీ చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఒక మెమొరబుల్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను. పైరసీని ఎంకరేజ్ చేయకండి. థాంక్యూ సో మచ్.” అని చెప్పారు.
ఈ చిత్రంలో క్యామియో రోల్ నటించిన హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘మానస నా సినిమాలో క్యామియో చేసింది కాబట్టి, నేను కూడా తన సినిమాలో చేశాను (నవ్వుతూ). డైరెక్టర్ కశ్యప్‌కి ప్రత్యేకమైన టైమింగ్ ఉంది. ఆ టైమింగ్‌ను ఈ సినిమాలో బాగా వాడుకున్నారని అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా వచ్చింది. చిన్నప్పటి నుంచి జేడీ గారి సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేసి మమ్మల్ని ఇన్‌స్పైర్ చేయాలి. ఈ సినిమాలో నేను చేయడానికి ఒక కారణం నారా రోహిత్ గారు కూడా. ఆయన నా సినిమాల్లో చాలాసార్లు క్యామియో చేశారు (నవ్వుతూ). పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తున్నప్పుడు మొదటి హీరోగా నేనే చేశాను. ఇప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కూడా నేను చేయడం ఆనందంగా ఉంది. విజయ్, భాను, కళ్యాణ్ వీరంతా నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ల కోసం నా వంతు కాంట్రిబ్యూషన్‌గా ఈ సినిమా చేశాను. ఈ ఈవెంట్‌కు వచ్చిన దర్శకులందరికీ థాంక్యూ’ అని చెప్పారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ చేసిన క్యారెక్టర్, ట్రంప్‌తో పెట్టుకున్న గొడవ వల్ల నా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. నాకు తెలియకుండా శ్రీ విష్ణు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఈ సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అవ్వకపోవచ్చు అనే స్టేజ్‌కి వచ్చింది. మేం ట్రంప్‌ను ఎంత బాగా వాడేమో అందరూ చూశారు. కానీ అక్కడ నుంచి కాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఈ సినిమా రిలీజ్ చేయకూడదనే ఒత్తిడి వచ్చింది. ఇది జోక్ కాదు.. చాలా సీరియస్ మేటర్. ఈ సినిమా వల్ల ఇండియాకు అమెరికాకు మధ్య గొడవ వస్తుందని చెప్పారు. ఇంతకంటే పెద్ద కామెడీ ఉండదని అనిపించింది. మా సినిమాలో ట్రంప్ కూడా యాక్ట్ చేశాడు. ఇండియాకు అమెరికాకు మధ్య డైరెక్టర్ కశ్యప్ వార్ తీసుకొచ్చాడు’ అని అన్నారు.
డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ ముందుగా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌కి థాంక్స్. వాళ్లు ఇచ్చిన సపోర్ట్ మామూలుది కాదు. నా గాడ్ బ్రదర్ పవన్ సాధినేని నేను భవిష్యత్తులో ఏ విజయాలు సాధించినా, దాని క్రెడిట్ ఆయనకే చెందుతుంది. జేడీ గారు, తరుణ్ ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా నాకు మంచి ఫ్రెండ్స్‌ను ఇచ్చింది. ఇందులో ట్రంప్ ఎలిమెంట్‌ను వినియోగించాం. శ్రీ విష్ణు గారి ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆయన ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పారు.
హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ ‘ఇందులో నాకు మంచి వైబ్ ఉన్న పాత్ర దక్కింది. డైరెక్టర్ కశ్యప్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదిరిపోతుంది. మానస ఈ సినిమాలో చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఆశించిన దానికంటే ఎక్కువ ఎంటర్టైన్‌మెంట్ ఈ సినిమా ఇస్తుంది’ అని చెప్పారు.
హీరోయిన్ మానస చౌదరి మాట్లాడుతూ. ‘ఈ చిత్రంలోని ప్రతి సీన్‌లో ఫన్ ఉంటుంది. కడుపుబ్బా నవ్వుకుంటూ బయటికి వస్తారు’ అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, సాయి మార్తాండ, హుస్సేన్ షా కిరణ్, హసిత్ గోలి, సందీప్ రాజ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
ఈ సినిమాలో మంచి ఫ్రెండ్షిప్ ఎలిమెంట్స్ ఉన్నాయని నిర్మాతలు పవన్ సాధినేని, సందీప్, భాను కిరణ్ అన్నారు. కో-ప్రొడ్యూసర్ దివ్య, గీత భాస్కర్, ఎడిటర్ విప్లవ్ సహా మూవీ యూనిట్ అందరూ పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.





