Skip to content

PinkvillaTelugu

Primary Menu
  • Home
  • News
  • Gossips
  • Reviews
  • OTT
  • Gallery
  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
Light/Dark Button
  • Home
  • News
  • వ్యవస్థలోని లోపాలను చూపిస్తూ ‘ది ఇండియా స్టోరీ’
  • News

వ్యవస్థలోని లోపాలను చూపిస్తూ ‘ది ఇండియా స్టోరీ’

Nani April 28, 2026 (Last updated: April 28, 2026)
kajal

ఇరవై ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తూ.. ఇప్పటికీ అదే అందం, అదే చార్మ్‌తో అదే స్టార్‌‌డమ్‌ను కొనసాగిస్తోంది కాజల్ అగర్వాల్. చందమామ, మగధీర, ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఎన్నో సూపర్ హిట్స్‌ తన ఖాతాలో ఉన్నాయి. మూడేళ్ల క్రితం ‘భగవంత్ కేసరి’ కీలక పాత్రతో మెప్పించింది. అలాగే ‘సత్యభామ’ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తోనూ మెప్పించింది. తాజాగా మరో ఫిమేల్ లీడ్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది కాజల్ అగర్వాల్. కంటెంట్ బేస్డ్ సినిమాలకు ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో కాజల్ లీడ్‌గా ‘ది ఇండియాస్టోరీ’ The India Story చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. Kajal Aggarwal, Shreyas Talpade ప్రధాన పాత్రల్లో నటించిన ఈ గ్రిప్పింగ్ సోషియో-నేషనల్ డ్రామా జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది. Chetan DK దర్శకత్వంలో, Sagar B Shinde నిర్మించి రచించిన ఈ చిత్రం సమకాలీన సమస్యలను బలంగా ప్రతిబింబిస్తోంది. ‘ది ఇండియా స్టోరి: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ సినిమా, రసాయనాల దుర్వినియోగం, పురుగుమందుల సాగు, వాటికి సంబంధించిన కుంభకోణాల నేపథ్యంతో సాగుతుంది. ఒక కుటుంబం ఎదుర్కొనే వ్యక్తిగత కష్టాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే పెద్ద సంక్షోభాన్ని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారు. సిస్టమ్‌లోని లోపాలు, కఠిన నియంత్రణల అవసరం వంటి అంశాలను దర్శకుడు ప్రభావవంతంగా చూపించే ప్రయత్నం చేశారు. పంట పొలాల్లో వాడే రసాయనాలు, వాటిని తయారు చేసే పెస్టిసైడ్ కంపెనీల స్కామ్‌ల నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద సంక్షోభంగా దీన్ని చూపిస్తూ, వ్యవస్థలోని లోపాలు, కఠినమైన నియంత్రణలు అవసరం అనే అంశాలను ఇందులో చర్చించబోతున్నట్టు మేకర్స్‌ తెలియజేశారు. ఇందులో కాజల్ అగర్వాల్‌ పవర్‌‌ఫుల్‌ లాయర్‌‌గా కనిపించనుంది. సాగర్ బి షిండే నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ సంస్థ రిలీజ్ చేస్తోంది. జూలై 24న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్మాత సాగర్ బి షిండే మాట్లాడుతూ ‘‘ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాకుండా, మానవ సంక్షోభం. ఈ సినిమా ద్వారా అవగాహన పెంచి, బాధ్యతపై చర్చలు మొదలుపెట్టాలనే ఉద్దేశంతో రూపొందించాం’ చెప్పారు.
దర్శకుడు చేతన్ డీకే మాట్లాడుతూ ‘‘కథను నిజాయితీగా చూపించడానికి టీమ్ మొత్తం కృష

About the Author

Nani

Author

View All Posts
Tags: kajalagarwal #theindianstory

Post navigation

Previous: ‘పెద్ది’ రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు
Next: సమంత బర్త్‌డే స్పెషల్.. సక్సెస్‌లు, సవాళ్లు, సమస్యలు, సరదాలు

Related Stories

Ranabaali PinkvillaTelugu
  • News

తెలుగు సినిమా గర్వపడేలా ‘రణబాలి’ : విజయ్ దేవరకొండ

Nani October 13, 2026 0
nani rukmini pinkvillaTelugu
  • Gossips
  • News

క్రేజీ కాంబో ఖరారు!

Nani October 13, 2026 0
AA Lokesh
  • News

బన్నీతో లోకేష్ సీరియస్ డిస్కషన్.. త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్

Nani October 12, 2026 0

Trending

Ranabaali PinkvillaTelugu
News

తెలుగు సినిమా గర్వపడేలా ‘రణబాలి’ : విజయ్ దేవరకొండ

Nani
October 13, 2026 0
akhil raj.. pinkvillatelugu
PressNews

‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత.. ‘క్రేజీ కల్యాణం’తో మరో మెట్టు ఎక్కుతా

Nani
October 13, 2026 0
nani rukmini pinkvillaTelugu
Gossips News

క్రేజీ కాంబో ఖరారు!

Nani
October 13, 2026 0
Venu Donepoodi
PressNews

కంట్రోల్డ్ బడ్జెట్‌లో భారీ సినిమా.. ‘రామం’ నా డ్రీమ్ ప్రాజెక్ట్ – వేణు దోనేపూడి

Nani
October 13, 2026 0

You May Have Missed

Ranabaali PinkvillaTelugu
  • News

తెలుగు సినిమా గర్వపడేలా ‘రణబాలి’ : విజయ్ దేవరకొండ

Nani October 13, 2026 0
akhil raj.. pinkvillatelugu
  • PressNews

‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత.. ‘క్రేజీ కల్యాణం’తో మరో మెట్టు ఎక్కుతా

Nani October 13, 2026 0
nani rukmini pinkvillaTelugu
  • Gossips
  • News

క్రేజీ కాంబో ఖరారు!

Nani October 13, 2026 0
Venu Donepoodi
  • PressNews

కంట్రోల్డ్ బడ్జెట్‌లో భారీ సినిమా.. ‘రామం’ నా డ్రీమ్ ప్రాజెక్ట్ – వేణు దోనేపూడి

Nani October 13, 2026 0
  • Home
  • News
  • Gossips
  • Reviews
  • OTT
  • Gallery
  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
Copyright © 2026 All rights reserved. | ReviewNews by AF themes.