‘పెద్ది’ రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ మూవీ రిలీజ్‌ డేట్‌ కోసం అంతా ఈగర్‌‌గా వెయిట్ చేస్తున్న సందర్భంలో దర్శకుడు బుచ్చిబాబు ఆదివారం ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే న్యూస్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని జూన్ 25న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అసలు విషయానికొస్తే.. ధనుష్ హీరోగా నటించిన ‘కర’ ట్రైలర్‌‌ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన బుచ్చిబాబు.. ధనుష్ యాక్టింగ్‌ను మెచ్చుకుంటూ, కర సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరారు. స్పీచ్ పూర్తవగానే అక్కడ యాంకర్‌‌గా ఉన్న సుమతో పాటు ఆడియెన్స్ సైతం ‘పెద్ది’ అప్‌డేట్ కోసం అరిచారు. దీంతో బుచ్చిబాబు జూన్ 25న వస్తుందని క్లారిటీ ఇస్తూ.. ప్రస్తుతం ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతోందని అప్‌డేట్ ఇచ్చారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27నే విడుదల చేయాలని ప్రకటించారు. కానీ ఆ డేట్‌ను ఏప్రిల్ 30కి మార్చారు. తర్వాత జూన్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు ఫైనల్ డేట్ లాక్ చేయడం అభిమానులను ఉత్తేజపరుస్తోంది.

ఈ చిత్రంలో చరణ్.. క్రికెటర్‌‌గా, పెహల్వాన్‌లా కనిపించనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.

Related Posts

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

నటుడిగా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతగా ఎదిగి టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఆదివారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడగా, సినీ రాజకీయ ప్రముఖుల రాకతో కార్యక్రమం మరింత…

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

గోపీచంద్ హీరోగా తన 34వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

  • By Nani
  • May 3, 2026
  • 4 views
బండ్ల వారి బ్లాక్‌ బస్టర్ ఎంగేజ్‌మెంట్

ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

  • By Nani
  • May 3, 2026
  • 6 views
ఫైట్ మాస్టర్‌‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న గోపీచంద్

‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

  • By Nani
  • May 3, 2026
  • 10 views
‘వారణాసి’కి వాటర్ ప్రాబ్లమ్.. షూటింగ్‌పై ప్రభావం

రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

  • By Nani
  • May 3, 2026
  • 21 views
రోషన్ కనకాల హీరోగా విజయ్ కామిశెట్టి డైరెక్టర్‌గా డెబ్యూ

టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

  • By Nani
  • May 2, 2026
  • 5 views
టైటిల్ వివాదంపై క్లారిటీ : వీళ్లే ‘‘కాప్‌’లు’’..

ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్

  • By Nani
  • May 2, 2026
  • 6 views
ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్