21 ఇయర్స్ అయినా.. మళ్లీ వస్తామంటే మేం వద్దంటామా

టాలీవుడ్‌లో హిట్ పెయిర్స్‌ను రిపీట్ చేయడం కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. అయితే వీరిది మాత్రం క్రేజీ కాంబో. వారే సిద్ధార్థ్​, త్రిష. వీరిద్దరూ కెరీర్ మొదలుపెట్టి పాతికేళ్లు దాటినా.. ఇప్పటికీ అదే అందం, అదే చార్మ్‌తో ప్రెజెంట్ జనరేషన్‌ను కూడా ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 21 ఇయర్స్ బ్యాక్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా వచ్చింది. కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిగా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు నిర్మించారు. ఈ సినిమా విజయంలో దివంగత నటుడు శ్రీహరి నటన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కాంబో అప్పట్లో ప్రేక్షకుల హృదయాలను గెల్చుకుంది. తాజాగా మరోసారి సిద్ధార్థ్​, త్రిష జోడీ రిపీట్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. పూర్తి కొత్త కథతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే దర్శకుడు ఎవరనేది త్వరలో రివీల్ చేయనున్నారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా కంప్లీట్ అండ్ ప్యూర్ లవ్‌స్టోరీగా రూపొందించనున్నారట. వీరి జంటకు అప్పటి జనరేషన్‌తోపాటు ఇప్పటి జనరేషన్‌ కూడా కనెక్ట్ అవుతారనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ చేసినట్టు తెలుస్తోంది. పైగా వీరి ఏజ్ రోజురోజుకి తగ్గిపోతున్నట్టుగా ఇంకా యంగ్‌గా కనిపిస్తుండటం కూడా సినిమాకు ప్లస్ అవుతుందని అనుకోవచ్చు. అందుకే ఇప్పటికీ వీరి జంటను మళ్లీ వస్తామంటే మేం వద్దంటామా అంటూ వైరల్ చేస్తున్నారు.

21 ఏళ్ల క్రితం వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’చిత్రంలోని కథాకథనంతోపాటు ప్రభుదేవా డైరెక్షన్, డైలాగ్స్, విజువల్స్‌, దేవిశ్రీ ప్రసాద్ అందించిన అన్ని పాటలుసూపర్ హిట్‌గా నిలిచాయి. ఇందులోని నిలువద్దం, సంథింగ్ సంథింగ్, పారిపోకే పిట్ట, పదం కదలా, అదిరే అదిరే పాటలకు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే ‘చంద్రుల్లో ఉండే కుందేలు కిందకొచ్చిందా’ అంటూ శంకర్ మహదేవన్ పాడిన పాట, గల్ గల్ అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సినిమాకు స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. వీటిలో ఎక్కువ పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారే లిరిక్స్ అందించడం విశేషం. అలా అన్ని కలిసొచ్చిన సినిమాకు ఎక్కడా నెగిటివ్ రీ మార్క్‌ లేకుండా వచ్చిన వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాకోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్‌ను కాస్త కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తుండటంతో అసలు ఎవరు…

‘దేవర 2’ పక్కనపెట్టి.. బాలయ్యతో బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసిన కొరటాల

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. నటసింహం బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌‌తో జనతా గ్యారేజ్, దేవర వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని