రెండేళ్ల క్రితం ‘మహావతార్ నరసింహ’గా ఆడియెన్స్ ముందుకొచ్చి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది ఈ చిత్రం. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, దాదాపు రూ.300 కోట్లు వసూళ్లూ రాబట్టి సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసింది. అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మరో శక్తివంతమైన అధ్యాయంగా ‘మహావతార్ పరశురామ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉద్భవిస్తాడు. ఆయన రూలర్ కాదు. అధర్మాన్ని వ్యతిరేకించే ఓ శక్తి’ అని తెలియజేస్తూ ఈ అనౌన్స్మెంట్ ఇచ్చింది మూవీ టీమ్. కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌తో మెప్పించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ.. క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ పేరుతో ఏడు యానిమేషన్ సినిమాలను నిర్మిస్తోంది. అందులో బాగంగా వస్తోన్న రెండో యూనివర్స్ ఇది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. భక్తి, యాక్షన్‌తో ఆకట్టుకున్న ‘మహావతార్’ విజయానంతరం, ఈ కొత్త భాగంతో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనుందని మేకర్స్ చెప్పారు. పరశురామ జయంతి సందర్భంగా విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. పరశురాముడి ముఖాన్ని చూపించకుండా, ఆయన చేతిలో రక్తంతో తడిసిన పరశును (గొడ్డలి) యుద్ధభూమి మధ్యలో చూపించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. పడిపోయిన యోధులు, ధూళితో నిండిన వాతావరణం, దూరంలో కనిపించే యుద్ధ దృశ్యాలు.. భారీ విధ్వంసం, డివైన్ జస్టిస్‌ని ప్రజెంట్ చేస్తున్నాయి. గ్లింప్స్ కూడా అంచనాలను మరింత పెంచుతోంది. సామ్ సిఎస్ అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పరశురాముడి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించనుంది. పురాణ గాథలతో పాటు ఆధునిక విజువల్ టెక్నాలజీని కలిపి ఒక కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందని నిర్మాతలు అన్నారు.





