ప్రశాంత్ నీల్ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది యాక్షన్ మూవీస్. కేజీఎఫ్, సలార్ లాంటి భారీ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఆడియెన్స్ భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆయన సమర్పణలో ఓ హారర్ థ్రిల్లర్ రూపొందుతోంది. తన దగ్గర అసిస్టెంట్‌గా వర్క్ చేసిన కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘418’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ‘పతంగ్’ ఫేమ్ ప్రీతి పగడాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘418’ అనే నెంబర్ రాసి ఉన్న తలుపు, దానిపై రక్తపు మరకలతో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్, మూఢనమ్మకానికీ అర్ధం కాని ఒక సీక్రెట్‌తో, సరికొత్త కథకథనాలతో గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోందని మేకర్స్ తెలియజేశారు. శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దినేష్ దివాకరన్ డీవోపీ, వెంకీ జి.జి మ్యూజిక్ అందిస్తున్నారు. మోహన్ బి.ఎస్ డైలాగ్స్ రాస్తున్నారు. అనిల్ యెర్నేని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పుడు ప్రశ్రాంత్ నీల్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ యంగ్ స్టర్స్ తో కలసి సరికొత్త హర్రర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక డ్రాగన్ విషయానికొస్తే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల జోర్డాన్‌లో హాలీవుడ్ స్థాయి భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రశాంత్ నీల్ చిత్రీకరించారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టొవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారు.





