‘మహావతార్ పరశురామ్’ రూలర్ కాదు.. ఒక శక్తి

రెండేళ్ల క్రితం ‘మహావతార్ నరసింహ’గా ఆడియెన్స్ ముందుకొచ్చి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది ఈ చిత్రం. రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, దాదాపు రూ.300 కోట్లు వసూళ్లూ రాబట్టి సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసింది. అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మరో శక్తివంతమైన అధ్యాయంగా ‘మహావతార్ పరశురామ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉద్భవిస్తాడు. ఆయన రూలర్ కాదు. అధర్మాన్ని వ్యతిరేకించే ఓ శక్తి’ అని తెలియజేస్తూ ఈ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది మూవీ టీమ్. కేజీఎఫ్‌, కాంతార, సలార్‌‌ లాంటి ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్స్‌తో మెప్పించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ.. క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌’ పేరుతో ఏడు యానిమేషన్ సినిమాలను నిర్మిస్తోంది. అందులో బాగంగా వస్తోన్న రెండో యూనివర్స్ ఇది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్‌‌లో రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు. భక్తి, యాక్షన్‌తో ఆకట్టుకున్న ‘మహావతార్’ విజయానంతరం, ఈ కొత్త భాగంతో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వనుందని మేకర్స్ చెప్పారు. పరశురామ జయంతి సందర్భంగా విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. పరశురాముడి ముఖాన్ని చూపించకుండా, ఆయన చేతిలో రక్తంతో తడిసిన పరశును (గొడ్డలి) యుద్ధభూమి మధ్యలో చూపించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. పడిపోయిన యోధులు, ధూళితో నిండిన వాతావరణం, దూరంలో కనిపించే యుద్ధ దృశ్యాలు.. భారీ విధ్వంసం, డివైన్ జస్టిస్‌ని ప్రజెంట్ చేస్తున్నాయి. గ్లింప్స్ కూడా అంచనాలను మరింత పెంచుతోంది. సామ్ సిఎస్ అందించిన పవర్‌‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పరశురాముడి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించనుంది. పురాణ గాథలతో పాటు ఆధునిక విజువల్ టెక్నాలజీని కలిపి ఒక కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందని నిర్మాతలు అన్నారు.

 

Related Posts

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ భారీ…

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

  • By Nani
  • April 24, 2026
  • 4 views
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! – పురాణపండ శ్రీనివాస్

రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

  • By Nani
  • April 23, 2026
  • 7 views
రివ్యూ : వాలా 2 : వండర్‌ఫుల్ యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా

జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

  • By Nani
  • April 23, 2026
  • 5 views
జక్కన్న మజాకానా.. మెక్సికోలో ‘వారణాసి’ భారీ ఈవెంట్

ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

  • By Nani
  • April 23, 2026
  • 6 views
ఎస్వీ కృష్ణారెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, దర్శకత్వంలో ‘‘వేదవ్యాస్”

‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

  • By Nani
  • April 23, 2026
  • 7 views
‘పెద్ది’ పాట కోసం ఏంటీ కన్ఫ్యూజన్..?

కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని

  • By Nani
  • April 22, 2026
  • 7 views
కామెడీ చేయడానికి నేను కమెడియన్‌ కాదు.. హీరోని