‘పెళ్లికి భాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది..’ అంటూ సాంగ్ పాడుకుంటోంది అందాల తార, స్టార్ హీరోయిన్ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఇటు సౌత్, అటు నార్త్‌లోనూ తనకంటూ క్రేజ్ తెచ్చుకుంది శృతిహాసన్. హీరోయిన్గా, సింగర్‌గా మల్టీటాలెంట్‌తో తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు నలభై ఏళ్ల వయసులో ఆమె పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదికూడా తన తండ్రి కమల్ చూసిన సంబంధం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే శృతికి ఇప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండగా, తనతో రిలేషన్ బ్రేకప్ అయ్యిందని, అందుకే ఆమె ఈ నిర్ణయానికి వచ్చిందట. ఈ నేపథ్యంలో తన బ్రేకప్ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంది. ఇప్పటికే తనకు సిక్స్ టైమ్స్ లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని, వాటివల్ల చాలా ప్రెషర్ ఫీలయ్యానని చెప్పుకొచ్చింది. ఇకపై సినిమానే జీవితంగా గడపాలనుకంటానని చెప్పింది. దీనిపై ఇంట్లో ఏం జరిగిందో ఏమో కానీ తాజాగా తండ్రి చూసిన అబ్బాయికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట శృతిహాసన్. అసలు ఆ అబ్బాయి ఎవరు?, ఏం చేస్తారనే దానికిపై కమల్ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. శృతికోసం కమల్ సెలెక్ట్ చేసిన ఆ హ్యాండ్సమ్ బాయ్ ఎవరో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు కమల్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు కెరీర్లోనూ శృతిహాసన్ దూసుకుపోతోంది. వరుస క్రేజీ ప్రాజెక్టులతో ప్రస్తుతం ఆమె బిజీగా ఉంది. రీసెంట్గా మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ చిత్రంలో ‘సంచారి’ పాట పాడి గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిందామె.






