ఈ టైటిల్ చూసి ఇదేదో నిజంగా బ్రేకింగ్ న్యూస్ అనుకునేరు. ఇదొక సినిమా టైటిల్. మీడియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ‘ది బ్రేకింగ్ న్యూస్’ టైటిల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. సీనియర్ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను చూడటానికి ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్ రోల్లో నేను ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు. అలాగే అనన్య నాగళ్ల నటనను కూడా ప్రశంసిస్తూ.. దర్శకుడు పవన్ కడియాల ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తికరంగా, విభిన్నంగా తెరకెక్కించినట్లు తెలుస్తోందని చెబుతూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని అన్నారు. ఈ చిత్రం మీడియా నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందని, ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు. సమ్మర్ స్పెషల్‌గా మే నెలలో థియేటర్స్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. శశి ప్రీతం సంగీతం అందిస్తుండగా, సాయినాథ్ సినిమాటోగ్రాఫర్‌గా, శిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.





