Nithya Menen Turns Villain In Bollywood
సౌత్ ఇండస్ట్రీలో విలక్షణమైన పాత్రలు, సహజమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామీనన్.. ఇప్పుడు బాలీవుడ్లో సరికొత్త అవతారంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు తనదైన నటనతో మెప్పించిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ఈసారి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Nithya Menen Turns Villain In Bollywood
దాదాపు ఏడేళ్ల క్రితం ‘మిషన్ మంగళ్’ సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించిన నిత్యామీనన్.. తాజాగా వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’ చిత్రంలో కీలకమైన నెగెటివ్ పాత్రను పోషిస్తోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు.
రెట్రో స్టైల్లో రూపొందించిన ఈ పోస్టర్లో వివేక్ ఒబెరాయ్, నిత్యామీనన్ ముఖాలు సగం మాత్రమే కనిపించేలా డిజైన్ చేశారు. కథలో దాగి ఉన్న రహస్యాలు, పాత్రల మధ్య నెలకొన్న అనుమానాలు, ఉత్కంఠను ఈ పోస్టర్ ఆసక్తికరంగా ప్రజెంట్ చేస్తోంది. ముఖ్యంగా నిత్యామీనన్ లుక్, ఆమె పోషిస్తున్న పాత్ర సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఆమె పాత్రలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయి? కథలో ఆమె అసలు ఉద్దేశం ఏమిటి? అన్న ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రేమ, నమ్మకద్రోహం, మోసం వంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ సాగనుంది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే జీవితంలో ప్రమాదకరంగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ప్రేమ వెనుక దాగి ఉన్న నిజాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యామీనన్ తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించనుండటం విశేషం.
వేవ్బ్యాండ్ ప్రొడక్షన్స్‌పై దాదాపు మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రానికి అంకుర్ పజ్నీ, విశాల్ రంజన్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేయా శర్మ, ఆశిష్ విద్యార్థి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.