Kaalanki Bhairavudu Third Single Out
మిస్టరీ, మిస్టికల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న చిత్రం ‘కాళాంకి భైరవుడు’. ఈ చిత్రం నుంచి మరో పాట విడుదలైంది. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ సినిమా థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
Kaalanki Bhairavudu Third Single Out
చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో జరిగిన కొన్ని విస్మయకర సంఘటనల నేపథ్యంలో ఈ మిస్టికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. హరి హారన్.వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ హీరోగా నటిస్తుండగా, రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

డీకొల్లు శ్రీధర్ సమర్పణలో గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమళ్ళ బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్. రావు, డా. రాచమళ్ళ శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.ఆర్. సంగీతం అందిస్తుండగా, అశోక్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. థర్డ్ సింగిల్ విడుదలతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.