Nani’s Strong Words at The Paradise Event
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో జోష్ నింపాయి. ముఖ్యంగా సినిమాపై తనకున్న నమ్మకంతో పాటు.. తనను ప్రేమించే అభిమానుల నమ్మకాన్ని ప్రస్తావిస్తూ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Nani’s Strong Words at The Paradise Event
‘ది ప్యారడైజ్’ ఒక సినిమా కాదని.. ఓ సెలబ్రేషన్‌లా ఉండబోతుందని నాని చెప్పాడు. సెప్టెంబర్ 23 రాత్రి నుంచే ఆ సెలబ్రేషన్ మొదలవుతుందని, థియేటర్లు ఊగిపోతాయని అన్నాడు. అభిమానుల సెలబ్రేషన్‌ను చూడటానికి తాను కూడా ఎదురు చూస్తున్నానని తెలిపాడు.
“మనం ఎదుగుతున్న కొద్దీ మన చుట్టూ పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా పెరుగుతుంది. నెగెటివ్‌ను పట్టించుకోకూడదు. పాజిటివ్‌ను పట్టుకుని ముందుకు వెళ్లాలి. మనం గెలవాలని కోరుకునే వాళ్లు పెరిగినట్టే.. మనం ఓడిపోతే చూడాలనుకునే వాళ్లు కూడా పెరుగుతారు” అంటూ నాని వ్యాఖ్యానించాడు.
అయితే తనను విమర్శించే వాళ్లకు సమాధానం చెప్పడం కోసం తాను పని చేయడం లేదని నాని స్పష్టం చేశాడు. “మనం ఓడిపోతే చూడాలనుకునే వాళ్లను ఓడించడానికి నేను ప్రయత్నించడం లేదు. కానీ నేను గెలుస్తాను అని నమ్మే వాళ్లని గెలిపించడానికి నేను కష్టపడుతూనే ఉంటా” అని చెప్పాడు. ఈ మాటలతో తన విజయం వెనుక అభిమానుల నమ్మకం ఎంత ముఖ్యమో నాని చెప్పకనే చెప్పాడు.
అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమను కూడా నాని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. “మీరు నాకు 100 ఏళ్లకు సరిపడా ప్రేమను ఇచ్చారు. మనల్ని ఎవరూ ఆపలేరు. నా నమ్మకం మీద మీ అందరికీ చాలా నమ్మకం ఉందని నాకు తెలుసు” అంటూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాడు.
‘ది ప్యారడైజ్’ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌పై కూడా నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. “23 రాత్రి నుంచి థియేటర్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సినిమా మొదలైనప్పుడే మీకు ఒక లాక్ పడుతుంది. అప్పుడు అంటుకునేది వైల్డ్ ఫైర్. శ్రీకాంత్ మాటల్లో చెప్పాలంటే తగలబడిపోతుంది” అంటూ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచాడు.
చివరగా ‘ది ప్యారడైజ్’కు సహకరిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నాని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక నేరుగా థియేటర్లలో కలుసుకుని సినిమాను సెలబ్రేట్ చేసుకుందామని అభిమానులకు పిలుపునిచ్చాడు.
నాని మాటల్లో కనిపించిన ఆత్మవిశ్వాసం, శ్రీకాంత్ ఓదెలపై ఉన్న నమ్మకం, అభిమానులపై ఉన్న ప్రేమ.. ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి నాని చెప్పినట్టుగా సెప్టెంబర్ 23 రాత్రి నుంచి థియేటర్లలో ఆ ‘సెలబ్రేషన్’ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
మాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్న MDనాగేంద్ర సార్ ధన్యవాదాలు💐