‘Emo Emo Idi’ Release Date Locked
యువతను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న మరో ఫ్రెష్ లవ్‌స్టోరీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్న ‘ఏమో ఏమో ఇది’ చిత్రానికి విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్ 30, 2026న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘Emo Emo Idi’ Release Date Locked
‘HIT’ సిరీస్‌తో థ్రిల్లర్ జానర్లో తనదైన ముద్ర వేసుకున్న శైలేష్ కొలను ఈసారి పూర్తిగా కొత్త జానర్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. క్రైమ్, థ్రిల్లర్ కథలతో ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. ఇప్పుడు ప్రేమ, భావోద్వేగాలు, యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలగలిసిన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఇక రోషన్ మేక, ప్రీతి ముకుందన్ కాంబినేషన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, ప్రేమకథలోని ఎమోషనల్ కనెక్ట్ సినిమాకు కీలకంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సూచిస్తోంది. ముఖ్యంగా ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ ఏమో ఏమో ఇది’ పేరుతో వచ్చిన వీడియో సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చింది.
సాధారణ ప్రేమకథకు భిన్నంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. విడుదల తేదీ అధికారికంగా ప్రకటించడంతో ఇక వరుసగా ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాటలు, మరిన్ని వీడియోలు, ఇతర అప్డేట్స్తో సినిమాపై హైప్ పెంచేందుకు సిద్ధమవుతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎస్., సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
థ్రిల్లర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలను నుంచి వస్తున్న తొలి పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో ‘ఏమో ఏమో ఇది’పై ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 30న ఈ సినిమా ఆ ఆసక్తిని ఏ స్థాయిలో థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చనుందో చూడాలి.