Mammootty’s Powerful Look in OM
మమ్ముట్టి బర్త్‌డే స్పెషల్‌గా ‘ఓం: చాప్టర్ 1- ఉధిరం’ గ్లింప్స్ రిలీజ్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 7న ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు చిత్ర యూనిట్లు వరుస సర్ప్రైజ్లు ఇచ్చాయి. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ‘మేళా’ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు, ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓం: చాప్టర్ 1 – ఉధిరం’ నుంచి మమ్ముట్టి పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు.
Mammootty’s Powerful Look in OM
ఈ గ్లింప్స్‌లో మమ్ముట్టి కనిపించిన తీరు సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. అంతర్జాతీయ క్రైమ్ నెట్‌వర్క్‌లో కీలక సూత్రధారిగా ఉన్న శియ అలియాస్ కార్తికేయన్ అనే వ్యక్తి కోసం ఇంటర్‌పోల్ అధికారులు, టాస్క్‌ఫోర్స్ బలగాలు తీవ్రంగా గాలిస్తుంటాయి. కానీ అతను మాత్రం తన కోసం ప్రపంచవ్యాప్తంగా వేట సాగుతున్నా ఏమాత్రం బెదరకుండా ఓ పోలీస్ స్టేషన్లో ప్రశాంతంగా కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తుండటం గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మమ్ముట్టి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా, అంతే స్టైలిష్‌గా ఉండబోతోందో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి చాలా ఇంటెన్స్‌గా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా సాయి అభ్యంకర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత ఎలివేషన్ ఇచ్చింది. మమ్ముట్టి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ పాత్రలోని మిస్టరీని మరింత పెంచాయి.
“గతాన్ని వదిలేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది”, “స్మగ్లర్నేగా… అంత బంగారమైన క్యారెక్టర్ ఏమీ కాదు” వంటి డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు మరో స్పెషల్ ఏమిటంటే.. ఈ గ్లింప్స్‌లో తన పాత్రకు మమ్ముట్టి స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పడం విశేషం.
ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ స్ట్రైక్ వీడియో, ‘అలా కా లూవా’ పాట సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మమ్ముట్టి బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఈ వీడియో గ్లింప్స్‌తో అంచనాలు మరింత పెరిగాయి. సినిమాలో ధనుష్ పాత్రకు, మమ్ముట్టి పాత్రకు మధ్య ఎలాంటి సంఘర్షణ ఉండబోతోంది? ఈ ఇద్దరు పవర్ఫుల్ నటులు వెండితెరపై ఎలాంటి పోటీని చూపించబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం: చాప్టర్ 1 – ఉధిరం’ భారీ తారాగణంతో రూపొందుతోంది. ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మమ్ముట్టి పవర్ఫుల్ ప్రెజెన్స్, ధనుష్ ఇంటెన్స్ యాక్షన్, స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఓం: చాప్టర్ 1 – ఉధిరం’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.