కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గోపాల గోపాల..’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు సనరే సాహిత్యాన్ని అందించగా, వంశీకాంత్ రేఖన కంపోజ్ చేశారు, మేఘన నాయుడు పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘ గోకుల గోపాలక, మాధవ నారాయణ, కానగా సాధ్యమా, కలియుగ మాయ, గోకుల గోపాలక, మాధవ నారాయణ, కాలమే సాక్షిగా అలమిన మాయ, నీదు మాయే నీల వర్ణా , హాసమైనా శోకమైనా కాంతులే నిలుపవా కనుతడిన..’ అంటూ కలియుగంలో జరుగుతున్న వింత ఘటనల్ని ఆ గోవిందుడికి విన్నవిస్తూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.





