Teja Sajja Returns with Zombie Reddy 2
‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటున్న యంగ్ హీరో తేజ సజ్జా మరోసారి జాంబీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాను మేకర్స్ గ్రాండ్‌గా ప్రకటించారు. ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ – డెడ్ ఆర్ అలైవ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
Teja Sajja Returns with Zombie Reddy 2
తెలుగు తెరకు జాంబీ జానర్‌ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘హక్’, ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి వెబ్ సిరీస్‌లతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న సుపర్ణ్ ఎస్. వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గత చిత్రంతో పోలిస్తే మరింత ఇంటెన్స్ కథ, భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
Teja Sajja Returns with Zombie Reddy 2
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ నటి షనాయా కపూర్ ఈ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం కానుంది. గౌరహరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్‌ను పూర్తిగా రివర్స్ ఆర్డర్లో రూపొందించడం విశేషం. ఫ్లైఓవర్‌పై నుంచి ఓ జాంబీ ట్రక్కుపై పడటంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ‘జాంబీస్ ఆర్ బ్యాక్’ అనే క్యాప్షన్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.
‘జాంబీ రెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త జాంబీ అనుభూతిని అందించిన టీమ్.. ఇప్పుడు ‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ – డెడ్ ఆర్ అలైవ్’తో మరింత భారీ స్థాయిలో ఎలాంటి హంగామా చేయబోతోందో చూడాలి..