బెల్లంకొండ గణేష్ హీరోగా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. బెల్లంకొండ ఫ్యామిలీకి ఇప్పటికే కథ వినిపించగా, అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ ఎవరనేది తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల్లోనే ఈ మూవీపై అధికారిక ప్రకటన వస్తుంది. ప్రేమకథా చిత్రాలు రూపొందించడంలో దిట్ట అయిన కరుణాకరన్.. గణేష్ కోసం ఓ ఫీల్ గుల్ లవ్‌స్టోరీని సిద్ధం చేశారట. అయితే చాలా గ్యాప్ తర్వాత, కరుణాకరన్ ఈ చిత్రాన్ని రూపొందించడం, అలాగే స్వాతిముత్యం, నేను స్టూడెంట్ సర్ లాంటి ఫెయిల్యూర్స్ తర్వాత వీరి కాంబోలో సినిమా అంటే ప్రస్తుతానికి ఎలాంటి అంచనాలు లేవనే చెప్పాలి. ఇక దర్శకుడు కరుణాకరన్ సినిమాల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్స్‌లో ఒకటైన ‘తొలిప్రేమ’ చిత్రంతో దర్శకుడిగా తానేంటో ప్రూవ్ చేసుకుని, మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్స్ సరసన చేరారు. అయితే ఆ తర్వాత తెరకెక్కించిన యువకుడు, వాసు, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవలేదు. కానీ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్, లవ్ ఎంటర్టైనర్స్ తో యూత్‌ను ఆకట్టుకున్నాయి. చివరగా సాయి ధరమ్ తేజ్‌తో ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా చేశాడు. ఈ సినిమాకు చేదు అనుభవమే ఎదురైంది. దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పడుతున్నారు. ఈ చిత్రం తనతోపాటు హీరో బెల్లంకొండ గణేష్‌కు కూడా చాలా ముఖ్యమైన సినిమాగా చెప్పుకోవాలి. ఇద్దరికీ కచ్చితంగా సక్సెస్ కావాల్సిన మూవీ ఇది. మరి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.!






