Sundeep Kishan Sigma Locks Oct 2 Release
సందీప్ కిషన్ హీరోగా కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ కొడుకు సంజయ్ జాసన్ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని జులై 31న విడుదల చేయాలనుకున్నారు. కానీ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. గాంధీ జయంతి సెలవుతో పాటు ఆ తర్వాతి వీకెండ్ కూడా కలిసిరావడంతో దసరా సీజన్ కూడా ఈ విడుదల తేదీ సినిమాకు బాక్సాఫీస్ పరంగా కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Sundeep Kishan Sigma Locks Oct 2 Release
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో సందీప్ కిషన్ ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. వార్మ్ లైటింగ్‌తో కూడిన ఇంటీరియర్‌లో ఓ డాగ్ పక్కన నిలబడి, కిటికీ నుంచి బయటకు చూస్తూ..
గోల్డెన్ సన్‌లైట్ మధ్య కనిపిస్తున్న సందీప్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో పాటు, సినిమా నుంచి వచ్చిన తొలి రెండు సింగిల్స్ కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ‘సిగ్మా’పై అంచనాలు మరింత పెరిగాయి.
ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హరిహరసుతన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు.
త్వరలోనే చిత్ర బృందం ప్రమోషన్స్‌ను మరింత జోరుగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. టీజర్, పాటలకు వచ్చిన స్పందన నేపథ్యంలో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.