Aadi Saikumar Sairabanu Firstlook
ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘సైరాబాను’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, కృష్ణకాంత్ పరుచూరి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. “A Fun Filled Journey of Love, Faith & Destiny” అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Aadi Saikumar Sairabanu Firstlook
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఇప్పుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా హీరో–హీరోయిన్లను రొమాంటిక్ యాంగిల్లో చూపించే పోస్టర్లకు భిన్నంగా.. ‘సైరాబాను’ ఫస్ట్ లుక్ కథలోని మెయిన్ ప్లాట్‌ను, ప్రేమను ఒకేసారి చెప్పేలా డిజైన్ చేశారు.
పోస్టర్లో ఆది సాయికుమార్ తెల్లటి సంప్రదాయ దుస్తుల్లో, నుదుటిపై విభూది, మెడలో రుద్రాక్ష మాలతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ కనిపించారు. ఆయన వెనుక హీరోయిన్ బాంధవి శ్రీధర్ నల్లటి హిజాబ్ ధరించి కూర్చుంది. ఆది భుజాలపై ఆమె చేతులు వేసుకున్న తీరు.. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా హైలైట్ చేస్తోంది.
అయితే ఈ పోస్టర్లో హీరోహీరోయిన్ల లుక్ కంటే వాటి చుట్టూ ఉన్న నేపథ్యమే అసలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు దేవాలయం, మరోవైపు మసీదు తరహా నిర్మాణాలు కనిపించడం ద్వారా రెండు విభిన్న మతాలు, సంస్కృతుల నేపథ్యంలో ఈ ప్రేమకథ సాగబోతుందనే సంకేతాన్ని ఇచ్చారు. పైగా చుట్టూ ఎగురుతున్న తెల్లని పావురాలు శాంతి, ప్రేమ, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
టైటిల్ ‘సైరాబాను’తో పాటు ఫస్ట్ లుక్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ప్రేమకు మతం అడ్డుగా నిలుస్తుందా? విశ్వాసం, కుటుంబం, విధి మధ్య ఈ జంట ఎలాంటి ప్రయాణం చేయబోతోంది? అనే ప్రశ్నలను పోస్టర్ ప్రేక్షకుల్లో కలిగిస్తోంది. అదే సమయంలో ఫన్, ఎమోషన్, రొమాన్స్ కలగలిసిన కథను దర్శకుడు ఫణి కృష్ణ సిరికి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టైటిల్ పోస్టర్, బిహైండ్ ది సీన్స్ వీడియోలకు మంచి స్పందన లభించగా.. తాజాగా వచ్చిన ఫస్ట్ లుక్‌తో ‘సైరాబాను’పై అంచనాలు మరింత పెరిగాయి. విభిన్నమైన కాన్సెప్ట్‌ను కమర్షియల్ ఎంటర్టైనర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా ఆది సాయికుమార్ కెరీర్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మా కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.