Venkatesh as Lieutenant Colonel Venkat Reddy
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు పూర్తయ్యాయి. 1986 ఆగస్టు 14న విడుదలైన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఆయన.. నాలుగు దశాబ్దాలుగా విభిన్న కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రంలోని ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Venkatesh as Lieutenant Colonel Venkat Reddy
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. #VenkyAnil5 #NKRAR2 పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

తాజాగా విడుదలైన పోస్టర్లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్‌తో రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నారు. భారీ SUV పక్కన నిలబడి కనిపిస్తున్న ఆయన గెటప్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. పోస్టర్లో ఆయన పాత్రను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్‌రెడ్డిగా పరిచయం చేశారు. ఇండియన్ ఆర్మీలో కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడైన ఆర్మీ అధికారిగా వెంకటేష్ కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే ఆర్మీ ఇన్సిగ్నియా, క్రాస్డ్ స్వోర్డ్స్ ఎంబ్లమ్, రాకీ టెర్రైన్, మ్యూటెడ్ బ్లూ-గ్రీన్ స్కై సినిమాకు మిలటరీ యాక్షన్ టచ్‌ను హైలైట్ చేస్తున్నాయి. ఎర్తీ క్యామోఫ్లేజ్ టోన్స్‌తో వెంకటేష్ లుక్ మరింత పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో పాటు కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు.
జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.