After Engineering: Raju Bonagani’s Youthful Entertainer
యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ లవ్‌స్టోరీకి ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’. రాస్రా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నూతన నటీనటులను పరిచయం చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజు బొనగాని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
After Engineering: Raju Bonagani’s Youthful Entertainer
‘ ఇది నా కథ మాత్రమే కాదు.. మన అందరి కథ’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత యువత జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, భావోద్వేగాలు, ప్రేమ, అనుబంధాలను వినోదాత్మకంగా ఆవిష్కరించే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు మేకర్స్ తెలిపారు. వినూత్నమైన కథలు, భావోద్వేగాలతో కూడిన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’ కూడా యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత తమ జీవితాల్లో చోటుచేసుకున్న అనుభవాలను గుర్తుచేసుకునేలా ఈ సినిమా ఉంటుందని పేర్కొంది.
ఈ సందర్భంగా దర్శకుడు రాజు బొనగాని మాట్లాడుతూ.. ఈ సినిమాను తెరకెక్కించడం ఆనందంగా ఉందని, యువతకు కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు మంచి ఎమోషన్‌ను కథలో చూపించనున్నామని తెలిపారు. ప్రస్తుతం ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’ సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా టైటిల్, నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర పూర్తి వివరాలను వెల్లడించడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి మరిన్ని విశేషాలను ప్రకటిస్తామని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు.